బాబోయ్.. కుళ్లిన ఫ్రూట్స్‌తో జ్యూస్ తయారీ, ప్రముఖ బేకరీలో దారుణం

బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించారు. ఆధారాలతో సహా బేకరీపై ఫిర్యాదు చేశారు. కుళ్లిన ఫ్రూట్స్ తో జ్యూసులు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న బేకరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

Juice With Rotten Fruits : నల్గొండ జిల్లా హాలియాలోని ఫేమస్ బేకరీ నిర్వాహకులు కుళ్లిన ఫ్రూట్స్ తో జ్యూస్ తయారు చేస్తున్నారు. ఈ కుళ్లిన జ్యూస్ తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇదేంటని ప్రశ్నించిన కస్టమర్ల పట్ల బేకరీ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు. బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

ఫేమస్ బేక్స్ కేక్ హౌస్ అండ్ స్వీట్స్ షాపులో దారుణం జరిగింది. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ తాగిన కొందరు కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులు బేకరీ ముందు ఆందోళనకు దిగారు. షాపులోనికి వెళ్లిన కొందరు కస్టమర్లు అక్కడి దృశ్యాలు చూసి షాక్ కి గురయ్యారు. అక్కడ అన్నీ కుళ్లిన ఫ్రూట్స్ ఉండటాన్ని గమనించారు. వాటితోనే జ్యూస్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే తమ ఫోన్లలో వాటిని ఫొటోలు, వీడియోలు తీశారు. దీనిపై బాధితులు.. బేకరీ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని బాధితులు వాపోయారు.

దీంతో బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించారు. ఆధారాలతో సహా వారికి బేకరీపై ఫిర్యాదు చేశారు. కుళ్లిన ఫ్రూట్స్ తో జ్యూసులు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న బేకరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. తప్పు చేయడమే కాకుండా ప్రశ్నించిన తమతో దురుసుగా ప్రవర్తించారని బేకరీ నిర్వాహకులపై మండిపడుతున్నారు బాధితులు.

Also Read : భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలివే!

 

ట్రెండింగ్ వార్తలు