Best Premium Flagship Phones : కొత్త ఫోన్ కావాలా? ఈ నెలలో 4 బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Premium Flagship Phones : ఈ సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి.

Best premium flagship smartphones to buy in India this September 2023

Best Premium Flagship Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అత్యుత్తమ, టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఆకర్షణీయమైన స్క్రీన్‌లు, హై-క్వాలిటీ కెమెరాలు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంటాయి. కానీ, బెస్ట్ ఆప్షన్లతో కూడిన ఫోన్లను ఎంచుకోవడం చాలా కష్టం. ఈ సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో కొనాల్సిన అత్యుత్తమ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

1. Samsung Galaxy Z Fold 5 :
ప్రస్తుతం శాంసంగ్ లేటెస్ట్ ఫోన్ మోడల్ (Galaxy Z Fold 5) భారత మార్కెట్లో రూ. 1 లక్ష 50వేల కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తోంది. మీరు టాప్-టైర్ స్పెషిఫికేషన్లతో కూడిన బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే.. గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ S23 Ultra బ్రైట్‌నెస్ పరంగా పెద్ద 7.6 (AMOLED) స్క్రీన్‌కి వెలుపలి స్క్రీన్ కలిగి ఉంది. గెలాక్సీ ఫోల్డ్ 5 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో ఆధారితమైన ర్యామ్‌ని కలిగి ఉంది. 1TB వరకు స్టోరేజీ కలిగి ఉంది. కెమెరా ఫీచర్లతో పగలు, రాత్రి సమయంలో అద్భుతంగా పనిచేస్తాయి.

Read Also : Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999కే సొంతం చేసుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

2. Samsung Galaxy S23 Ultra :
శాంసంగ్ గెలాక్సీ (S23 Ultra 5G) ఫోన్ ఇప్పటికీ శాంసంగ్ అత్యుత్తమ ఫోన్‌లలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం కొనుగోలుకు ఈ కొత్త ఫోల్డబుల్ అందుబాటులో ఉంది. నిజంగా అద్భుతమైన స్క్రీన్‌ను కలిగి ఉంది. డెడికేటెడ్ S-పెన్‌తో కూడా వస్తుంది. స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది. చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. కెమెరా చాలా బాగుంది, 200MP ప్రైమరీ రియర్ కెమెరాతో కొన్ని పవర్‌ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.

హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8 Gen 2, 1TB వరకు స్టోరేజీ స్పేస్ కలిగి ఉంది. బ్యాటరీ కూడా పెద్దదిగా ఉంటుంది. ఛార్జ్ అవసరం లేకుండా రోజంతా పనిచేస్తుంది. మీకు అత్యుత్తమ ఫోన్ కావాలంటే.. గెలాక్సీ S23 అల్ట్రా కచ్చితంగా టాప్ ఆప్షన్. ఈ ఫోన్ కొనుగోలుకు చాలా ఖర్చు కావచ్చు.

Best Premium Flagship Phones to buy in India this September 2023

3. Vivo X90 Pro 5G :
మీకు మంచి కెమెరా ఫోన్ కావాలంటే.. ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. Vivo X90 Pro 5G బెస్ట్ ఆప్షన్. Galaxy S23 అల్ట్రా కన్నా చాలా చౌకగా ఉంటుంది. ఈ ఫోన్ చాలా బాగుంది. కెమెరా బాగా పనిచేస్తుంది. లోపల డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌ అందిస్తుంది. బ్యాటరీ మంచి బ్యాకప్ అందిస్తుంది. చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. కేవలం 8 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు వెళ్లవచ్చు. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో కూడిన లోన్ వెర్షన్‌కు ధర రూ.84,999 ఉంటుంది. మీరు ఫొటోలను తీయడానికి ఇష్టపడితే.. మంచి ఫీచర్లతో కూడిన స్టైలిష్ ఫోన్ కావాలనుకుంటే.. వివో X90 ప్రో 5G బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

4. OnePlus 11 5G :
మీరు నిజంగా బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకుంటే.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే.. (OnePlus 11 5G) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ వెర్షన్ భారత మార్కెట్లో ధర రూ.56,999 నుంచిప్రారంభమవుతుంది. Snapdragon 8 Gen 2 లోపల వేగంగా రన్ అవుతుంది. రియల్ లుక్, మృదువైన స్క్రీన్‌ను కలిగి ఉంది. బ్యాటరీ 5000mAh పెద్దదిగా ఉంటుంది. ఛార్జ్ అవసరం లేకుండా రోజంతా ఉంటుంది. అయితే, మీరు ఫోన్‌ను ఛార్జ్ చేయవలసి వస్తే.. బాక్స్‌లో 100W ఛార్జర్‌తో 100W ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. 16GB వరకు RAM అందిస్తుంది. స్పీడ్ తగ్గకుండా ఒకేసారి చాలా యాప్‌లను నిర్వహించగలదు. కెమెరాతో బెస్ట్ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేస్తుంది.

Read Also : Best Smartphones in September : రూ. 15వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు