iPhone 12 mini Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. రూ.20,999లకే సొంతం చేసుకోండి.. అద్భుతమైన ఆఫర్.. డోంట్ మిస్..!

iPhone 12 Mini Offer : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ అందిస్తోంది. ఆపిల ఐఫోన్ 12 మినీపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది.

iPhone 12 mini Offer on Flipkart : ప్రముఖ ఐకానిక్ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 12 మినీపై అదిరే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 12 మినీ ధరను భారీగా తగ్గించింది. ఈ ఐఫోన్ 12 మినీపై రూ. 20,999 తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేందుకు వినియోగదారులు ఎక్కువ ఇష్టపడటంతో స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద స్ర్కీన్లతో వస్తున్నాయి. కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇష్టపడే యూజర్ల కోసం కొన్ని ఆప్షన్లు ఉన్నాయి.

అందులో ఆపిల్ ఐఫోన్ 12 మినీ ఒకటి. ఆపిల్ ‘మినీ’ స్మార్ట్‌ఫోన్‌లలో చివరిదిగా చెప్పవచ్చు. ఐఫోన్ 12 మినీ ఫోన్ అదిరే ఫీచర్లను కలిగి ఉంది. కాంపాక్ట్ 5.4-అంగుళాల డిజైన్‌లో ఉంది. A14 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 Miniని తక్కువ ధరకే అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 20,999 తగ్గింపు పొందవచ్చు.

Read Also : Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లాంచ్ టైమ్ అప్పుడేనట..!

ఐఫోన్ 12 మినీ డిస్కౌంట్ :
ఐఫోన్ 12 మినీ 64GB వేరియంట్ అసలు ధర రూ. 59,900గా ఉంది. అయితే, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఐఫోన్ 12 మినీపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ కేవలం రూ. 20999లకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్రారంభంలో ఐఫోన్ 12 మినీ ధరను రూ. 50,999కు అందించింది. ఇప్పుడు తగ్గింపు ఆఫర్ ద్వారా రూ. 8,901కు తగ్గింది. ఇతర ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్‌లతో ధరను రూ. 20999లకు తగ్గింది.

iPhone 12 mini Offer _ Get iPhone 12 Mini on Flipkart

ఐఫోన్ 12 మినీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ :
ఐఫోన్ 12 మినీపై ఫ్లిప్‌కార్ట్ గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 30వేల ఐఫోన్ 12 మినీ ఫోన్‌పై గరిష్ట తగ్గింపును పొందవచ్చు. తద్వారా మీ ఐఫోన్ 12 మినీ కేవలం రూ. 20,999కు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఐఫోన్ తగ్గింపు అనేది.. మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ లొకేషన్‌లో ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై ఆధారపడి ఉంటుంది.

ఐఫోన్ 12 మినీపై బ్యాంకు ఆఫర్లు :
ఐఫోన్ 12 మినీపై కొనుగోలుదారులు (Flipkart Axis) బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా, మీరు నవంబర్ 2023 వరకు చెల్లుబాటు అయ్యే క్యాష్‌బ్యాక్ కూపన్‌ను కూడా పొందవచ్చు. ఒకేసారి పేమెంట్ చేయలేకపోతే.. నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

Read Also : Oppo F23 5G Launch : ఇది కదా ఫోన్ అంటే.. ఒప్పో F23 5G ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు, మే 18 నుంచే సేల్..!

ట్రెండింగ్ వార్తలు