Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లాంచ్ టైమ్ అప్పుడేనట..!

Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీకయ్యాయి. లీక్ డేటా ప్రకారం పరిశీలిస్తే.. రాబోయే ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసింది.. ఇతర ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.

Apple iPhone 15 Price Leak : ప్రపంచ ఐకానిక్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌కు ఫీచర్లు లీకయ్యాయి. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్‌ల నుంచి ఎలాంటి మోడల్స్ రానున్నాయో లీక్‌ డేటా రివీల్ చేసింది. రాబోయే iPhone 15 స్మార్ట్‌ఫోన్‌తో కంపెనీ డిజైన్‌లో అనేక మార్పులు చేయనుంది. హై-ఎండ్ స్పెక్స్‌ను అందించాలని భావిస్తున్నారు. లీక్‌ల ఆధారంగా ఐఫోన్ 15 డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ధర గురించి ఇప్పటివరకు ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఐఫోన్ 15లో డిజైన్ మార్పులు :
ఆపిల్ స్టాండర్డ్ వెర్షన్ ఐఫోన్ డిజైన్‌లో ఎట్టకేలకు కొన్ని మార్పులు చేయనుంది. ఐఫోన్ 15 లాంచ్‌తో కంపెనీ కొత్త డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ తక్కువ ధర కలిగిన మోడళ్లకు కూడా తీసుకురానుంది. గతంలో ఐఫోన్ 14 ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితం అయింది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను చూడవచ్చు. చాలా కాలంగా వేలకొద్దీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కనిపిస్తోంది. ఆపిల్ కొత్త డిజైన్‌ను స్టాండర్డ్ మోడల్‌లతో రానుంది.

Read Also : JioCinema Premium : జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ఇదిగో.. ఏడాది ప్లాన్ ధర ఎంత? లేటెస్ట్ HBO షోల ఫుల్ లిస్టు మీకోసం..!

ఎందుకంటే కొన్నేళ్లుగా సాధారణ మోడల్‌లలో అదే డిజైన్‌ను అందిస్తోంది. బ్యాక్ కెమెరా డిజైన్ అలాగే ఉంటుంది. ఆపిల్ యాజమాన్య లైట్నింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్ C పోర్ట్‌ని అందించనుంది. చివరగా, ఆపిల్ ఐఫోన్ 15, ప్లస్ వేరియంట్ గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడల్‌ల మాదిరిగానే మాట్ ఫినిషింగ్‌తో ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్‌తో రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి.

Apple iPhone 15 Price Leak Expected specifications, launch timeline, price and other details

ఆపిల్ ఐఫోన్ 15 లీకైన స్పెక్స్, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 15 బయోనిక్ A16 చిప్‌సెట్‌ను హుడ్ కింద అందిస్తుంది. గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడళ్లకు శక్తినిచ్చింది. గత ఏడాదిలో ఆపిల్ కొత్త వ్యూహం ప్రామాణిక మోడల్‌లతో ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను అందించనుంది. కొత్త చిప్ ప్రో మోడల్‌ల రిజర్వ్ చేసుకుంది. 2023 మోడళ్ల విషయంలో కూడా అదే జరుగనుంది. ఆప్టిక్స్ పరంగా.. ఐఫోన్ 15 గత మోడళ్లతో పోలిస్తే.. ఈ విభాగంలో భారీ అప్‌గ్రేడ్ ఉండనుంది. 5G ఫోన్ వెనుక భాగంలో 48-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రో మోడల్‌లలో 12-MP సెన్సార్‌ల కన్నా పెద్ద అప్‌గ్రేడ్ రానుంది. ఆప్టికల్ జూమ్ లేదా LiDAR టెలిఫోటో అందించనుంది.

ఐఫోన్ 15 ధర (అంచనా) :
లీక్‌ల ప్రకారం.. రాబోయే ఐఫోన్ పాత వెర్షన్ iPhone 14 ధరతో సమానంగా ఉంటుంది. భారత మార్కెట్లో ఐఫోన్ 14 ధర రూ.79,900తో వచ్చింది. ఈ కొత్త వెర్షన్‌కు ఇదే శ్రేణిలో ధర నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆపిల్ కొత్త డిజైన్ లేదా పెద్ద మార్పులు ఉండొచ్చు. ధరను మాత్రం కొంత మార్జిన్‌తో పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర పెంచుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఐఫోన్ 15 లాంచ్ తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read Also : Pixel 7a Series : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7a సిరీస్ సేల్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? 5 కారణాలివే..!

ట్రెండింగ్ వార్తలు