ఎర్రచందనం స్మగ్లింగ్.. పవన్ కల్యాణ్ సీరియస్, అధికారులకు కీలక ఆదేశాలు

ఎర్రచందనం.. జిల్లాలు, రాష్ట్రాలు దాటి పోతున్నాయని, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Pawan Kalyan : అటవీశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక పెద్ద తలకాయలను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్. స్మగ్లర్లను నడిపిస్తున్న వారిని పట్టుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు పవన్. శేషాచలంలో స్మగ్లర్లు ఎక్కడెక్కడ ఎర్రచందనం దాచి పెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు. ఎర్రచందనం.. జిల్లాలు, రాష్ట్రాలు దాటి పోతున్నాయని, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పటికే పలు శాఖలపై ఉన్నతాధికారులతో రివ్యూలు చేశారు పవన్. ఆయా శాఖల అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తాజాగా అటవీశాఖపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ సీరియస్ అయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు పవన్. ఎర్రచందనం అక్రమ రవాణ వెనుకున్న పెద్ద తలకాయలను పట్టుకోకపోతే ఎలా? అని అధికారులను ప్రశ్నించారు పవన్. చాలా కాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని, స్మగ్లింగ్ వెనుకున్న బడా నేతలు, వ్యాపారులను పట్టుకుని శిక్షించాలని పవన్ ఆదేశించారు.

ముఖ్యంగా శేషాచలంలో కొట్టేసిన ఎర్రచందనం దుంగలు ఎక్కడెక్కడ దాచి పెట్టారు అనేది తక్షణమే గుర్తించాలన్నారు. అవసరమైతే దీనికోసం ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు పవన్. జిల్లాలు, రాష్ట్రాలు దాటి తరలిపోతున్న ఎర్రచందనాన్ని పట్టుకోవడంలో నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అని పవన్ ప్రశ్నించారు. నిఘా వ్యవస్థలను పూర్తిగా పటిష్ట పరచాలన్నారు. రాష్ట్రాలు దాటిపోతున్న ఎర్రచందనం దుంగలకు సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తెలుపుతూ ఓ నివేదిక ఇవ్వాలన్నారు పవన్.

దీంతో పాటు కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్, దానికి సంబంధించిన కేసు వివరాలు కూడా అందించాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్. ఎర్రచందనం అక్రమ రవాణకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత పర్సంటేజ్ శిక్షలు పడ్డాయి? ఈ వివరాలన్నీ తనకు ఇవ్వాలని ఆదేశించారు పవన్ కల్యాణ్. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎర్రచందనం డంపింగ్ లు ఉన్నాయో అక్కడి నుంచి వాటిని తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని, తద్వారా రాష్ట్ర సంపదను కాపాడాలని ఆదేశాలు జారీ చేశారు పవన్.

Also Read : చంద్రబాబు లెక్క మారిందా? ఈసారి అనుకున్నది సాధిస్తారా?

ట్రెండింగ్ వార్తలు