JioCinema Premium : జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ఇదిగో.. ఏడాది ప్లాన్ ధర ఎంత? లేటెస్ట్ HBO షోల ఫుల్ లిస్టు మీకోసం..!

JioCinema Premium : జియోసినిమా ప్రీమియంలో ప్రసారమయ్యే కొన్ని లేటెస్ట్ HBO షోలలో ది లాస్ట్ ఆఫ్ అస్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సక్సెషన్ ఉన్నాయి. మీకు నచ్చిన కంటెంట్ వీక్షించవచ్చు.

JioCinema Premium Subscription Plan : ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియోసినిమా (JioCinema) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఆకర్షణీయమైన కంటెంట్‌కి యాక్సెస్‌ ఇస్తుంది. FIFA వరల్డ్ కప్, IPL 2023, విక్రమ్ వేద వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల వంటి పాపులర్ ఈవెంట్‌లకు ఫ్రీ స్ట్రీమింగ్‌ను అందించింది. తద్వారా ఈ ప్లాట్‌ఫారమ్ భారీగా ఫాలోవర్లను సంపాదించుకుంది. జియోసినిమా ప్రీమియం ప్రారంభంతో.. వినియోగదారులు ఇప్పుడు HBO వంటి ప్రముఖ స్టూడియోల నుంచి ప్రత్యేకమైన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.

జియోసినిమా ప్రీమియంలో ప్రసారమయ్యే కొన్ని లేటెస్ట్ HBO షోలలో ది లాస్ట్ ఆఫ్ అస్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, సక్సెషన్ ఉన్నాయి. అదనంగా, ఈ ప్లాట్‌ఫారమ్ రాబోయే నెలల్లో ప్రీమియం లైబ్రరీలో సరికొత్త కంటెంట్‌ను యాడ్ చేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, JioCinema యాప్ Android, iOS డివైజ్‌ల్లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది.

జియోసినిమా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర ఎంతంటే? :

జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని కొనుగోలుకు (JioCinema Website) వెబ్‌సైట్‌కి వెళ్లి సబ్‌స్క్రైబ్ బటన్‌పై (Click) చేయండి. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ సంవత్సరానికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏ డివైజ్‌లోనైనా JioCinema చూడవచ్చు. కంపెనీ హైక్వాలిటీ వీడియో, ఆడియో క్వాలిటీని అందిస్తుంది. జియోసినిమా యాప్ 4 డివైజ్‌ల్లో ఏకకాలంలో పని చేయగలదు.

Read Also : Apple iPhone 14 : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.45వేలు మాత్రమే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

మీరు ఈ ప్లాన్ వెంటనే కొనుగోలు చేయవచ్చు. అకౌంట్ వివరాలను మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేయొచ్చు. జియో భౌగోళిక ప్రాంతాలలో మల్టీ లాగ్-ఇన్‌లను ప్రభావితం చేస్తాయో లేదో పేర్కొనలేదు. ప్రస్తుతం వినియోగదారులకు కేవలం ఒక వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది. జియోసినిమా భవిష్యత్తులో కొన్ని నెలవారీ చౌకైన ప్లాన్‌లను ప్రారంభించే అవకాశం ఉంది.

JioCinema Premium : జియోసినిమాలో HBO షోల లిస్టు ఇదే.. :

* ది లాస్ట్ ఆఫ్ అస్ (The Last of Us)
* హౌస్ ఆఫ్ ది డ్రాగన్ (House of the Dragon)
* చెర్నోబిల్ (Chernobyl)
* వైట్ హౌస్ ప్లంబర్స్ (White House Plumbers)
* వైట్ లోటస్ (White Lotus)
* మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్ (Mare of Easttown)
* విన్నింగ్ టైమ్ (Winning Time)
* బారీ (Barry)
* సక్సెషన్ (Succession)
* బిగ్ లిటిల్ లైస్ (Big Little Lies)
* వెస్ట్‌వరల్డ్ (Westworld)
* సిలికాన్ వ్యాలీ (Silicon Valley)
* ట్రూ డిటెక్టివ్ (True Detective)
* న్యూస్‌రూమ్ (Newsroom)
* గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones)
* ఎంటూరేజ్ (Entourage)
* కర్బ్ యువర్ ఎంథోసియాజమ్ (Curb Your Enthusiasm)
* పెర్రీ మాసన్ (Perry Mason)

JioCinema Premium subscription plan launched in India

జియోసినిమా ఈ ఏడాది ప్రారంభంలో (WarnerBros)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ వంటి మేజర్ ప్లేయర్‌లు మార్కెట్‌లో ఎక్కువ వాటా కోసం పోటీపడుతున్నాయి. భారతీయ స్ట్రీమింగ్ మార్కెట్ పోటీగా మారుతున్న సమయంలో రిలయన్స్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ కొత్త భాగస్వామ్యంతో, జియోసినిమాతో ఎక్కువ శాతం మంది వినియోగదారులను ఆకర్షించాలని భావిస్తోంది. దేశంలోని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. HBO కంటెంట్‌ను ప్రసారం చేయడం ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ యాప్ ఎలాంటి లాభాలను పొందిందో అదే స్థాయిలో జియోసినిమా కూడా తమ సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవాలని భావిస్తోంది.

Read Also : OnePlus Nord 3 : రూ.30వేల లోపు ధరలో వన్‌ప్లస్ నార్డ్ 3 వచ్చేస్తోంది.. ఈ 5G ఫోన్ లాంచ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు