Pixel 7a Series : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7a సిరీస్ సేల్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? 5 కారణాలివే..!

Pixel 7a Series : గూగుల్ కొత్త పిక్సెల్ 7a ఫోన్ సేల్ మొదలైంది.. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ద్వారా కొత్త పిక్సెల్ ఫోన్‌ ధర రూ. 43,999కు కొనుగోలు చేయవచ్చు. లేటెస్ట్ 5G పిక్సెల్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఐదు కారణాలివే..

Pixel 7a Series sale in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం గూగుల్ కొత్త పిక్సెల్ 7a ఫోన్ సేల్ మొదలైంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో Pixel 7a ఫోన్ భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. Pixel 6a కన్నా భారీ అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ పిక్సెల్ 7a ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. గూగుల్ నుంచి కొత్త Pixel 7a ఫోన్ ధర రూ.43,999గా నిర్ణయించింది. ఈ పిక్సెల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఐదు కారణాలేంటి? ఓసారి లుక్కేయండి.

భారత్‌లో పిక్సెల్ 7a ధర ఎంతంటే? :
పిక్సెల్ (Pixel 7a) 128GB స్టోరేజ్ మోడల్ ధర 43,999కు అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ ఆఫర్‌తో ఈ మిడ్-రేంజ్ 5G ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ బ్యాంక్ కార్డ్ ఉన్నవారికి రూ.4వేలు తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ.39,999కి తగ్గుతుంది.

Read Also : OnePlus Nord 3 : రూ.30వేల లోపు ధరలో వన్‌ప్లస్ నార్డ్ 3 వచ్చేస్తోంది.. ఈ 5G ఫోన్ లాంచ్ ఎప్పుడంటే? 

పిక్సెల్ 7a కొనుగోలుకు 5 కారణాలు :
తక్కువ ధర, ఫీచర్లు కూడా బాగున్నాయి. పిక్సెల్ 7a పెద్ద అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో లభించే గొప్ప డీల్.. Pixel 7a కొనుగోలు చేయడానికి గల ఇతర కారణాలలో ఇదొకటి. భారత్‌లో దాదాపు రూ. 40వేల ధర ఉన్న ఇతర డివైజ్‌ల కన్నా అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వచ్చింది. 64-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, నేచురల్ కలర్స్, లైటింగ్ పరిస్థితుల్లో డైనమిక్ ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. అతి తక్కువ కాంతి ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. పోర్ట్రెయిట్‌ ఫొటోలకు బెస్ట్ అని చెప్పవచ్చు.

Pixel 7a Series is now on sale in India via Flipkart: 5 reasons to buy, 2 to avoid

Pixel 6a స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. Pixel 7a డిస్‌ప్లే చాలా పవర్‌ఫుల్ అని చెప్పవచ్చు. ఈ డివైజ్ స్క్రీన్ ఇప్పుడు 90Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. పిక్సెల్ 7a కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉంది. బెస్ట్ డిస్‌ప్లే సైజుల్లో ఇదొకటి. ఇతర ఫోన్‌ల మాదిరిగా బ్లోట్‌వేర్ కూడా లేదు. మెసేజ్‌లు లేదా రికార్డింగ్‌ల రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్, కాల్ మేనేజ్‌మెంట్ సహా అద్భుతమైన గూగుల్ ఫీచర్‌లను పొందవచ్చు. ఒంటి చేత్తో ఫోన్‌ని సులభంగా వాడేలా UI కూడా చక్కగా ఉంది. చివరిగా, Pixel 7a సాధారణ పర్ఫార్మెన్స్ స్పీడ్ ఉంటుంది గూగుల్ ఫ్లాగ్‌షిప్ Tensor G2 చిప్‌సెట్‌‌తో వచ్చింది. ఖరీదైన Pixel 7 సిరీస్‌లో లేటెస్ట్ 5G ఫోన్‌లో Genshin ఇంపాక్ట్ వంటి గ్రాఫికల్ ఇంటెన్సివ్ గేమ్‌లను ఆడుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

Pixel 7a కొనొద్దు.. ఆ 2 కారణాలివే :
-గూగుల్ గత ఫోన్‌ల మాదిరిగానే Pixel 7a స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జర్‌ను అందించదు. ఈ ఫోన్ ఛార్జర్ కోసం అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. పాత ఛార్జర్‌ని ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు. కంపెనీ ఇప్పుడే 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్‌లు అంత గొప్పగా ఉండవు. వాల్యూమ్ 90 శాతం వద్ద రీసౌండ్ కలిగి ఉంటాయి. వీడియోలను చూస్తే సౌండ్ క్వాలిటీ కూడా కొద్దిగా డీసెంట్‌గా ఉంటుంది.

Read Also : JioCinema Premium : జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ఇదిగో.. ఏడాది ప్లాన్ ధర ఎంత? లేటెస్ట్ HBO షోల ఫుల్ లిస్టు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు