మొదటి షెడ్యూల్‌లో మహేశ్ బాబు పాల్గొంటాడా? లేదా?

SS Rajamouli: పొడవాటి జుట్టు, గడ్డంతో చూపించడం ఎలా? అన్నది ఇంకా జక్కన్న తేల్చుకోలేకపోతున్నారట...

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో నిర్మించనున్న చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుంది? పాన్‌ వరల్డ్‌ లెవెల్‌లో సినిమా తీయాలనుకుంటున్న జక్కన్న… ఇంకా తుదిమెరుగులు దిద్దుతూనే ఉన్నారా? సినిమా కోసం ఆరేడు గెటప్‌లను ట్రై చేస్తున్న మహేశ్‌బాబు… ఏ లుక్‌లో కనిపించనున్నారు? జక్కన్న ఆలోచనలేంటి?

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట.. ఆగస్టులో సెట్‌ వర్క్‌ పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు టాలీవుడ్‌ టాక్‌.

దీంతో సెప్టెంబర్‌లో సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటివరకు రాజమౌళి – మహేశ్‌బాబు కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభం అవ్వాలంటే 2025 వరకు వెయిట్‌ చేయాల్సిందే అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లోనే మొదటి షెడ్యూల్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి షెడ్యూల్‌ లో మహేష్ బాబు పాల్గొంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మహేశ్‌ లుక్‌ ఇంకా ఫైనల్‌ కాలేదని అంటున్నారు.

సరికొత్త లుక్‌లో మహేశ్‌
అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. భారతీయ భాషలతోపాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను అనువదించనున్నారు. ఇప్పటివరకూ వెండితెరపై కనిపించని సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గడ్డం, జుట్టు పెంచారు మహేశ్‌బాబు. అదే సమయంలో దృఢంగా కనిపించేందుకు అవసరమైన కసరత్తులు కూడా చేస్తున్నారట.

తేల్చుకోలేకపోతున్న జక్కన్న?
అయితే ఇప్పటివరకు గ్లామరస్‌ పాత్రలతో…. మిల్క్‌ బాయ్‌లా మెరిసిపోయే లుక్‌లో కనిపించిన మహేశ్‌బాబు….. పొడవాటి జుట్టు, గడ్డంతో చూపించడం ఎలా? అన్నది ఇంకా జక్కన్న తేల్చుకోలేకపోతున్నారట… పొడవైన గడ్డం మహేశ్‌కు సూట్‌ అవ్వడం లేదని అంటున్నారు. దీంతో మహేశ్‌ లుక్‌పై మరిన్ని స్కెచ్‌లు గీస్తున్నట్లే చెబుతున్నారు. మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసిందని.. ఇందులో ఏది ఫైనల్‌ చేస్తారో ఇంకా డిసైడ్‌ చేయలేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ట్రిపుల్‌ ఆర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌ను హాలీవుడ్‌ రేంజ్‌కు తీసుకువెళ్లిన జక్కన్న… మహేశ్‌ సినిమాపై అస్సలు రాజీ పడటం లేదంటున్నారు. సినిమా కథకు తగ్గ లుక్‌లో మహేశ్‌ను చూపించి ప్రేక్షకులను మెప్పించడం ఎలా అన్నదే జక్కన్న తేల్చుకోలేకపోతున్నారట…. అందుకే సెప్టెంబర్‌లో సినిమాను సెట్స్‌ పైకి తీసుకువెళ్లినా… మహేశ్‌ బాబుతో షెడ్యూల్‌ ఉంటుందో లేదో ఫైనల్‌ చేయలేదు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్‌పైనే అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. మరి జక్కన్న ఎలాంటి స్కెచ్‌ ఫైనల్‌ చేస్తారో చూడాల్సివుంది.

14 Movie Review : ’14’ మూవీ రివ్యూ.. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

ట్రెండింగ్ వార్తలు