iPhone 14 Big Discount : అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కొనాలా వద్దా? ఐఫోన్ 15 కోసం ఆగాలా?

iPhone 14 Big Discount : ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్ మొదలైంది. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌కు సబ్‌స్క్రిప్షన్ లేని యూజర్లు ఆగస్టు 4న జరిగే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) ఈవెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు.

iPhone 14 gets big discount at Amazon Independence Day Sale

iPhone 14 Big Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్ (Amazon Independence Day Sale) సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈవెంట్ (Amazon Great Freedom Festival Sale) సందర్భంగా, iPhone 14 ప్రస్తుతం రూ. 66,999 వద్ద లిస్టు అయింది.

ఈ ఐఫోన్ అసలు ధర రూ. 79,900 నుంచి తగ్గింది. ఐఫోన్ యూజర్లు రూ.12,901 తగ్గింపును పొందవచ్చు. SBI బ్యాంక్ కార్డులతో ధర రూ.66,249కి తగ్గుతుంది. వినియోగదారులు పొందే మొత్తం తగ్గింపు 128GB స్టోరేజ్ మోడల్‌పై ధర రూ. 13,651 వరకు ఉంటుంది. బ్యాంకులతో కొంత ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే, వచ్చే నెలలో ఆపిల్ ఐఫోన్ 15 (iphone 15 Launch) లాంచ్ కావచ్చు. ఇప్పుడు ఐఫోన్ 14 కొనడం సరైనదేనా? లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Infinix GT 10 Pro Launch : రంగులు మార్చే బ్యాక్ ప్యానల్‌తో ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు..!

ఐఫోన్ 14 కొనుగోలు చేయాలా? ఐఫోన్ 15 కోసం ఆగాలా? :
మీరు అధిక ధర చెల్లించి.. కొత్త ఫీచర్లు కావాలనుకుంటే.. ఐఫోన్ 15 కోసం వేచి ఉండవచ్చు. ఎందుకంటే.. వచ్చే నెలలో భారత్ సహా ఇతర మార్కెట్లలో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అవుతుంది. ఇప్పటివరకు, రాబోయే iPhone 15 ఫోన్‌లో కెమెరా, చిప్‌సెట్, ఫ్రంట్ డిజైన్, బ్యాటరీ, బ్యాక్ ఫినిషింగ్ పరంగా భారీ అప్‌గ్రేడ్‌తో రానుందని లీక్‌లు సూచించాయి.

iPhone 14 gets big discount at Amazon Independence Day Sale

అయితే, ఆపిల్ దిగ్గజం అధికారికంగా ఇంకా ఏదీ ధృవీకరించలేదు. కొత్త ఐఫోన్ చాలా ఖరీదైనదని గమనించాలి. ఆపిల్ మునుపటి ఐఫోన్ 14 మోడల్ మాదిరిగానే ఐఫోన్ ధరను దాదాపు రూ. 80వేలుగా నిర్ణయించింది. మీరు కొత్త అప్‌గ్రేడ్‌లను కోరుకుంటే.. అధిక ధర కలిగిన ఐఫోన్ 15 కోసం వేచి చూడవచ్చు.

కానీ, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. ఐఫోన్ 14కి బదులుగా iPhone 13 కొనడం బెటర్. ఎందుకంటే ఈ రెండూ టెక్నికల్‌గా దాదాపుగా ఎలాంటి మార్పులు లేకుండా ఉంటాయి. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ మాత్రం ఉంది. iPhone 13లో ఈ ఫీచర్ లేదు. కానీ, ఈ శాటిలైట్ ఫీచర్‌కు భారత్‌లో సపోర్టు లేదు. కెమెరా, చిప్‌సెట్, డిస్‌ప్లే, డిజైన్, మరిన్నింటి పరంగా మిగిలిన ప్రాంతాలు ఒకే విధంగా ఉంటాయి.

మీరు iPhone 15 స్మార్ట్‌ఫోన్‌పై అధిక ధరను ఖర్చు చేయలేకపోతే.. iPhone 13ని కొనుగోలు చేయడం ఉత్తమం. ఐఫోన్ 13 ప్రస్తుతం భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.61,999 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. అయితే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆగస్టు 4 నుంచి స్వాతంత్ర్య దినోత్సవ విక్రయాన్ని ప్రారంభించనున్నాయి. ఈ సేల్ సమయంలో ఐఫోన్లు సహా అనేక స్మార్ట్ ఫోన్లపై మరింత తక్కువ ధరకు పొందవచ్చు.

Read Also : MG Comet EV Edition : భలే ఉంది భయ్యా.. ఎంజీ కామెట్ ఈవీ ‘స్పెషల్ గేమర్’ ఎడిషన్‌ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

ట్రెండింగ్ వార్తలు