MG Comet EV Edition : భలే ఉంది భయ్యా.. ఎంజీ కామెట్ ఈవీ ‘స్పెషల్ గేమర్’ ఎడిషన్‌ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

MG Comet EV Edition : MG కామెట్ EV ప్రత్యేక గేమర్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈవీ గేమింగ్ వెర్షన్, ప్రత్యేకమైన డిజైన్, మరెన్నో గేమింగ్ ఫీచర్‌లు ఉన్నాయి. ప్రామాణిక మోడల్ కన్నా ధర రూ. 65 వేలు ఎక్కువగా ఉంటుంది.

MG Comet EV Special Gamer Edition Launched at a Premium of Rs 65,000MG Comet EV Special Gamer Edition Launched at a Premium of Rs 65,000

MG Comet EV Edition : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) కంపెనీ ఇటీవల కామెట్ EV ప్రత్యేకమైన గేమర్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. భారత టాప్ గేమర్‌లలో ఒకరైన మోర్టల్ అని పిలిచే నమన్ మాథుర్‌తో ప్రత్యేకమైన సహకారాన్ని అందిస్తోంది. MG కామెట్ EV మొత్తం 3 సాధారణ వేరియంట్‌లలో వస్తుంది. ప్రతిదాని ధర కన్నా MG కామెట్ గేమర్ ఎడిషన్ ధర రూ. 65,000 ప్రీమియంతో వస్తుంది. ఈవీ సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారిగా కస్టమైజ్ చేసిన కారు ఇదే. ఎంజీ కామెట్ గేమర్ ఎడిషన్ చక్రాలు, డోర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

B-పిల్లర్‌పై స్టిక్కర్‌లతో పాటు ప్రత్యేకమైన డిజైన్ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. కారు లోపల క్యాబిన్ నియాన్ లైట్లతో అప్‌గ్రేడ్ అయింది. పవర్‌ఫుల్ గేమింగ్ వాతావరణాన్ని కలిగి ఉంది. అదనంగా, కీ, వివిధ ఇంటీరియర్ ఎలిమెంట్స్ స్పెషల్ డిజైన్‌తో ప్రీమియం టచ్‌ను కలిగి ఉన్నాయి.

MG Comet EV Special Gamer Edition Launched at a Premium of Rs 65,000

Read Also : Best Smartphones in India : ఈ ఆగస్టులో రూ. 25వేల లోపు ధరకే 4 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ఎంజీ మోర్టల్ మధ్య సహకారంతో గేమింగ్, ఆటోమోటివ్ ప్రపంచాన్ని ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకమైన జీవనశైలితో కూడిన కారును కోరుకునే గేమర్‌ల కమ్యూనిటీని అందిస్తుంది. ఇందులోని ప్రత్యేక డిజైన్, గేమింగ్-ప్రేరేపిత ఫీచర్లు, ఎంజీ కామెట్ గేమర్ ఎడిషన్ పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

ఎంజీ కామెట్ EV ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). పేస్, ప్లే, ప్లష్ అనే 3 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎంజీ కామెట్ పేస్ ఎంట్రీ-లెవల్ ట్రిమ్ ధర రూ. 7.98 లక్షలు, ప్లే, ప్లస్ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటాయి.

MG Comet EV Special Gamer Edition Launched at a Premium of Rs 65,000

ఎంజీ కామెట్ EV పొడవు 3 మీటర్ల లోపు, 1,640mm ఎత్తు, 1,505mm వెడల్పుతో వస్తుంది. 12-అంగుళాల స్టీల్ వీల్స్‌పై నడుస్తుంది. కామెట్ EV ప్రధాన భాగం 17.3kWh బ్యాటరీ ప్యాక్, 230 కి.మీ పరిధిని సాధించగలదని MG పేర్కొంది. వాహనం ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే 3 డ్రైవ్ మోడ్‌లను అందిస్తుంది. కామెట్ EV హుడ్ కింద వెనుక ఇరుసుపై అమర్చిన ఒకే మోటార్ ఉంది.

గరిష్టంగా 41hp పవర్ అవుట్‌పుట్, 110 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఈ సెటప్‌తో, వాహనం గరిష్టంగా 100kmph స్పీడ్ అందుకోగలదు. ఆసక్తి గల కస్టమర్లు తమకు ఇష్టమైన కారును ఆన్‌లైన్‌లో ఎంజీ వెబ్‌సైట్ (MG  Official Website)  లేదా భారత్‌లో ఎంజీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ కస్టమైజడ్ గేమింగ్ ఎడిషన్ అన్ని కామెట్ ఈవీ (EV) వేరియంట్‌లలో (పేస్, ప్లే, ప్లష్) అందుబాటులోఉంది.

Read Also : Infinix GT 10 Pro Launch : రంగులు మార్చే బ్యాక్ ప్యానల్‌తో ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు