iQOO Z7s 5G Launch : రూ. 20వేల లోపు ధరలో ఐక్యూ Z7s 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

iQOO Z7s 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఐక్యూ (iQOO) నుంచి కొత్త iQOO Z7s 5G ఫోన్ లాంచ్ అయింది. రూ. 20వేల ధరలో ఈ కొత్త ఐక్యూ 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

iQOO Z7s 5G Launched in India : భారత మార్కెట్లోకి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ (iQOO) నుంచి సరికొత్త 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అదే.. iQOO Z7s మోడల్. ఈ కొత్త 5G ఫోన్ ఎలాంటి ప్రకటన లేకుండానే కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో చేర్చింది. దేశంలో ఇటీవలే iQOO Z7 5G ఫోన్ కూడా లాంచ్ అయింది. ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న ఏకైక ప్రధాన వ్యత్యాసం చిప్‌సెట్ మాత్రమే. అయితే, కంపెనీ అసలు ఐక్యూ Z7 స్మార్ట్‌ఫోన్ ధరను అమాంతం పెంచింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో లేటెస్ట్ iQOO Z7s ప్రారంభ ధర రూ. 18,999 తో లాంచ్ అయింది.

6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్, (8GB RAM + 128GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ.19,999 ఉండగా, iQOO Z7 5G ధర ఇప్పుడు (Flipkart)లో రూ. 21,990కి పెరిగింది. భారత మార్కెట్లో iQOO నియో 7 డివైజ్ రూ. 29,999కి విక్రయిస్తోంది. ఈ బ్రాండ్ ఇప్పుడు వేర్వేరు ధరల వద్ద 5G ఫోన్‌లను అందిస్తోంది. అదనంగా, కొన్ని లాంచ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ (ICICI), HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,500 తగ్గింపును అందిస్తోంది. ఈ కార్డ్‌లను కలిగిన యూజర్లు iQOO Z7 ఫోన్ చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు, iQOO Z7s స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : BGMI Game India : మొబైల్ గేమర్లకు గుడ్‌న్యూస్.. భారత్‌లో BGMI గేమ్ డౌన్‌లోడ్.. ఆడే ముందు ఈ 2 రూల్స్ తప్పక తెలుసుకోండి..!

iQOO Z7 మాదిరిగానే iQOO Z7s లేటెస్ట్ కొత్త చిప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 అందిస్తోంది. ఎందుకంటే రూ. 20వేల కన్నా తక్కువ ధరలో అనేక మిడ్-రేంజ్ 5G ఫోన్‌లు ఒకే SoCని ఉపయోగిస్తున్నాయి. అయితే, ఐక్యూ వేరే చిప్‌సెట్‌తో కొత్త ఫోన్‌ను ఎందుకు రిలీజ్ చేసిందో ప్రస్తుతానికి తెలియదు. కొత్త iQOO Z7s ఫోన్ 6.38-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+, గరిష్టంగా 1300నిట్స్ బ్రైట్‌నెస్, షాట్ క్సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

iQOO Z7s 5G Launch in India under Rs 20K, here are price and other details

పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌, మార్కెట్‌లోని కొన్ని ఇతర ఫోన్‌లలో మాదిరిగా సాధారణ బ్యాక్ కెమెరా డిజైన్‌ను కలిగి ఉంది. ఫోటోగ్రఫీతో పాటు వీడియో రికార్డింగ్ కొత్త 5G ఫోన్‌లో f/1.79 ఎపర్చరుతో 64-MP ప్రైమరీ ISOCELL GW3 సెన్సార్, f/2.4 ఎపర్చర్‌తో 2-MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16-MP ఫ్రంట్ కెమెరా ఉంది. హుడ్ కింద 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ 44W ఛార్జింగ్‌కు సపోర్టును అందించింది. ఈ ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కూడా IP54 రేట్ అయింది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ని కలిగి ఉంది, కానీ, సింగిల్ బాటమ్-ఫైరింగ్ స్పీకర్‌ను అందిస్తుంది.

Read Also : Tata Altroz iCNG : ట్విన్-సిలిండర్ CNGతో టాటా ఆల్ట్రోజ్ కారు.. అదిరే ఫీచర్లు.. రూ. 7.55 లక్షలకే సొంతం చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు