TPCC Senior Vice President Niranjan ( Image Credit : Google )
TPCC Senior Vice President Niranjan Comments : తెలంగాణ మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. శనివారం (మే 18) గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మోదీ నిజస్వరూపం, ఆయన ద్వంద విధానాలు బయటపడ్డాయని విమర్శించారు. మోదీ మహిళ వ్యతిరేకి అనేది అర్థమైందని అన్నారు.
Read Also : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడం ద్వారా మెట్రో నష్టపోతుంది మోదీ వ్యాఖ్యానించారు. మహిళలు సంతోషపడుతుంటే.. మోదీకి ఎందుకు కంటగింపు అంటూ నిరంజన్ మండిపడ్డారు. మెట్రో కేవలం హైదరాబాద్‌కి మాత్రమే పరిమితమని, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ సందర్భంగా మోదీకి గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం పథకం అమలు చేశామని అన్నారు. 29 లక్షల మంది మహిళలు ప్రతి రోజు ఈ సౌకర్యం పొందుతున్నారని తెలిపారు. కార్పొరేట్ వ్యక్తులకు రుణాలు మాఫీ చేసినప్పుడు ఎందుకు ఆలోచించలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వాలు వ్యాపారం కోణంలో ఎప్పుడు చూడవద్దు అనేది మోదీ తెలుసుకోవాలని నిరంజన్ హితవు పలికారు.
Read Also : Swati Maliwal Case : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్