Swati Maliwal Case : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్
స్వాతి మలివాల్ పై బిభవ్ కుమార్ దాడి ఘటన రాజకీయ దుమారం రేపింది. కేజ్రీవాల్ ఈ ఘటనపై మౌనం వహించడంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Swati Maliwal and Bibhav Kumar
Arvind Kejriwal Aide Bibhav Kumar arrested : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మాలీవాల్ పై దాడి ఘటనలో బిభవ్ ను అరెస్టు చేశారు. సీఎం కేజ్రీవాల్ నివాసంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన అనంతరం అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. బిభవ్ అరెస్ట్ పై అతని తరపు న్యాయవాది కరణ్ శర్మ మాట్లాడుతూ.. తమకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ఈమెయిల్ పంపించినప్పటికీ పోలీసులనుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని కరణ్ శర్మ తెలిపారు.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు
సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని మాలీవాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం స్వాతి మాలీవాల్ కు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వాతి ఎడమ కాలు మీద, కుడి కన్ను కింద గాయం గుర్తులు ఉన్నాయని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
Also Read : చంద్రబాబు లేఖ.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ఆఫీస్ అప్ గ్రెడేషన్ ప్రక్రియ వాయిదా
స్వాతి మాలీవాల్ పై బిభవ్ కుమార్ దాడి ఘటన రాజకీయ దుమారం రేపింది. కేజ్రీవాల్ ఈ ఘటనపై మౌనం వహించడంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలాఉంటే.. తనపై దాడి చేసిన సమయంలో సీసీ కెమెరాలను మాయం చేస్తారని స్వాతీమాలీవాల్ ఆరోపించిన నేపథ్యంలో శనివారం ఉదయం ఆప్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో సీఎం నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను పంపిస్తున్నట్లు వాటిలో కనిపించింది. బయటకు తీసుకెళ్తున్న సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేశారు.