చంద్రబాబు లేఖ.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ఆఫీస్ అప్ గ్రెడేషన్ ప్రక్రియ వాయిదా
అప్ గ్రెడేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని గవర్నరుకు, ఏపీ సీఈఓకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాయడంతో ఈసీ స్పందించింది.

e-office upgradation: ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ఆఫీస్ అప్ గ్రెడేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అప్ గ్రెడేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని గవర్నరుకు, ఏపీ సీఈఓకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాయడంతో ఈసీ ఈమేరకు స్పందించింది. ఈ ఆఫీస్ అప్ గ్రెడేషన్ ప్రక్రియపై ఎన్ఐసీ ప్రతినిధులను పిలిపించి ఏపీ సీఈఓ ఆరా తీశారు. ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను నిలపాలని ఎన్ఐసీకి సీఈఓ ఆదేశాలిచ్చారు.
రేపట్నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ అప్ గ్రెడేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఢిల్లీలోని నేషనల్ ఇన్‌ఫర్‌మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఇంతకుముందే షెడ్యూల్ ప్రకటించింది. అయితే విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో అప్ గ్రేడేషన్ తాత్కాలికంగా నిలిపివేశారు. అప్ గ్రెడేషన్ ప్రక్రియ చేపట్టే తదుపరి షెడ్యూలును తర్వాత విడుదల చేస్తామని శాఖాధిపతులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ప్రస్తుతమున్న ఈ-ఆఫీస్ వెర్షనుతోనే విధులు నిర్వహించాలని హెచ్వోడీలను ఆదేశించింది.
Also Read: కీలక నేతలు అరెస్ట్? ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ నియామకం..!
ప్రభుత్వ అంతర్గత సమాచార మార్పిడి కోసం తాజా వెర్షన్ 7.x కి ఈ-ఆఫీస్‌ను ఎన్ఐసీ అప్ గ్రెడేషన్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలతో పాటు సీబీఎస్ఈ వంటి సంస్థల్లో అప్ గ్రెడేషన్ ప్రక్రియకు ఎన్ఐసీ షెడ్యూల్ ఖరారు చేసింది. తాజా వెర్షన్‌కి అప్ గ్రేడ్ చేసిన ఈ-ఆఫీస్ కొత్త ఫీచర్లను ఇప్పటికే 14 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ-ఆఫీస్ ఫైల్స్ అత్యంత భద్రతతో కూడిన ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో నిల్వ ఉంటాయి. ఏదైనా విపత్తులు సంభవించినా కూడా సంబంధిత ఫైల్‌కు సంబంధించిన బ్యాకప్ (రికవరీ) సదుపాయం ఉంటుంది. ఒక్కసారి ఈ-ఫైల్ లోకి సమాచారం చేరితే సంబంధిత ఫైల్‌ను తొలగించడం, మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం.
Also Read: కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తున్న వైఎస్ జగన్