కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వైఎస్ జగన్

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వైఎస్ జగన్

YS Jagan

Updated On : May 17, 2024 / 11:37 PM IST

CM Jagan London Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి తొలుత లండన్ వెళ్తారు. జూన్ 1 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ తీరక లేకుండా గడిపిన జగన్ కు కాస్త విశ్రాంతి దొరికింది. మే 13న ఏపీలో ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో జగన్ విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. మే1న ఆయన తిరిగి ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది.

జగన్ గతంలోనూ పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లోని పర్యాటన ప్రాంతాలకు వెళ్లివచ్చారు. కాగా, ఎన్నికలు ముగియడంతో కొన్ని రోజులుగా ఇతర ప్రధాన పార్టీల నేతలు కూడా కుటుంబ సభ్యులతో గడుపుతూ కనపడుతున్నారు. చాలా మంది నేతలు రాజకీయాల తర్వాత కుటుంబ సభ్యులతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తారు.

Also Read: ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి తలుపులు పగలగొట్టి ప్రవేశించారు: వైఎస్సార్సీపీ లీగల్ సెల్