ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి తలుపులు పగలగొట్టి ప్రవేశించారు: వైఎస్సార్సీపీ లీగల్ సెల్
Tadpatri Constituency: ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో కలకలం..

MLA Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టాముట్టారని తెలుపుతూ తాజాగా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఆయన అనుచరులు. వైసీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.
దీనిపై ఈసీకి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో తలుపులు పగలగొట్టి ప్రవేశించి కార్యకర్తలను కొడుతున్నట్లున్న సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని ఆధారంగా దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ లీగల్ సెల్ కోరింది.
కాగా, ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో కలకలం రేగుతోంది. తాడిపత్రి పట్టణంలో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. పోలీసు బందోబస్తు పెంచారు.
ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఘర్షణలు చోటుచేసుకుంటుండడం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి చర్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
Also Read: చంద్రబాబుకు భద్రత పెంపు.. ఏపీలో జూన్ 19వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక