Jio Prima 4G Phone : అత్యంత సరసమైన ధరకే జియో ప్రైమా 4G ఫోన్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు మీకోసం..!

Jio Prima 4G Phone : రిలయన్స్ జియో సరికొత్త ఫీచర్ ఫోన్ (JioPhone Prima 4G Launch)ని లాంచ్ చేసింది. 2.4-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 ఈవెంట్లో ప్రదర్శించింది. పూర్తి వివరాలివే..

Jio Prima 4G Phone : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త జియోఫోన్ Prima 4G ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (IMC)లో ప్రదర్శించింది. వచ్చే దీపావళి నాటికి ఈ జియో 4జీ ఫోన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే, ఈ జియో ఫోన్ ఇప్పుడు (JioMart) వెబ్‌సైట్‌లో వివరాలతో అందుబాటులో ఉంది. జియోఫోన్ ప్రైమా 4జీ అనేది ప్రీమియం డిజైన్‌తో కూడిన ఫీచర్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ డివైజ్ వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్‌లతో వస్తుంది.

జియో ప్రైమా 4జీ ఫోన్ ధర ఎంతంటే? :

కొత్తగా లాంచ్ చేసిన జియో ప్రైమా 4జీ ఫోన్ 320×240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 2.4-అంగుళాల (TFT) డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా, ఫోన్‌లో 0.3ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో సహా ఫ్లాష్‌లైట్, కెమెరా ఉన్నాయి. హుడ్ కింద, ఈ జియో ఫోన్ 512ఎంబీ ర్యామ్‌తో పవర్ అందిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీ సామర్థ్యాన్ని 128జీబీ వరకు విస్తరించవచ్చు. KaiOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతున్న ఈ 4జీ ఫోన్ ARM కార్టెక్స్ A53 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Read Also : Reliance Jio Annual Plans : రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్రీగా చూసేయొచ్చు!

కనెక్టివిటీ విషయానికి వస్తే.. జియో ఫోన్ ప్రైమా 4జీ బ్లూటూత్ 5.0ని కలిగి ఉంది. 1800mAh బ్యాటరీతో వస్తుంది. మీ ఫోన్‌ని ఎక్కువ కాలం రన్ చేసేందుకు తగినంత పవర్ అందిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే.. జియో ఫోన్ ప్రైమా 4G ఎఫ్ఎం రేడియో ఫీచర్‌తో వస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన ఎఫ్ఎం స్టేషన్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ జియో ఫోన్ యూట్యూబ్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్ వంటి ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లతో కూడా వస్తుంది. అందులో యాక్టివిటీ కోసం వినియోగదారులు సినిమా, జియో పే (JioPay) యాక్సెస్‌ను పొందవచ్చు.

Jio Prima 4G phone launch

జియో స్పేస్‌ఫైబర్ సర్వీసులు :

మరోవైపు.. రిలయన్స్ జియో జియో స్పేస్‌ఫైబర్‌ (Jio SpaceFiber) సర్వీసును ప్రారంభించింది. గతంలో ఇంటర్నెట్ సదుపాయం లేని భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు గిగాబిట్ వేగాన్ని అందించే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును అందిస్తోంది. (SES) O3b, O3b mPOWER శాటిలైట్ యాక్సెస్ చేసేందుకు ఎస్ఈఎస్ అనే శాటిలైట్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీతో జియో భాగస్వామ్యం కలిగి ఉంది. అంతరిక్షం నుంచి ఫైబర్-వంటి ఇంటర్నెట్ సర్వీసులను అందించగల సింగిల్ ఎంఈఓ శాటిలైట్స్, జియో ఎస్‌ఈఎస్ 2022 ప్రారంభంలో జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ (Jio Space Technology Limited) అనే జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. భారతీయ కంపెనీ ఉపగ్రహాల ద్వారా గిగాబిట్ ఇంటర్నెట్‌ను అందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ముందుగా 4 ప్రాంతాల్లోకి.. :
భూస్థిర కక్ష్య (GEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO) అనే రెండు కక్ష్యలలో ఉపగ్రహాలను విజయవంతంగా నిర్వహించడం, వాణిజ్యీకరించడం ద్వారా ఎస్ఈఎస్ ప్రపంచంలోనే మొదటి సంస్థగా పేరొందింది. SES కక్ష్యలో 70కి పైగా ఉపగ్రహాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు వీడియో, డేటా సర్వీసులను అందిస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, హనీవెల్, హ్యూస్ నెట్‌వర్క్ సిస్టమ్స్, స్పేస్‌ఎక్స్‌(SpaceX)తో సహా ఇతర పెద్ద పేర్లతో కూడా SES భాగస్వామ్యం కలిగి ఉంది.

జియో ప్రారంభంలో భారత్‌లో 4 అత్యంత మారుమూల ప్రదేశాలలో జియో స్పేస్‌ఫైబర్ సర్వీసులను ప్రారంభించింది. ఇప్పటికే గుజరాత్‌లోని గిర్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, ఒడిశాలోని నబరంగ్‌పూర్, అస్సాంలోని ONGC-జోర్హాట్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. స్పేస్ ఫైబర్ శాటిలైట్ సర్వీసులు తర్వాత దేశంలో ఎక్కడికి విస్తరిస్తుందో జియో ఇంకా ప్రకటించలేదు. అతి త్వరలోనే విస్తరించే అవకాశం ఉంది.

Read Also : JioSpace Fiber Satellite Service : భారత్ ఫస్ట్ గిగాబైట్ శాటిలైట్ కనెక్టివిటీ ఇదిగో.. గ్రామీణ ప్రాంతాల్లోనూ జియోస్పేస్ ఫైబర్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు

ట్రెండింగ్ వార్తలు