Santhosh Narayanan : కల్కిలో మహాభారతం ఉంది.. దానికి మ్యూజిక్ ఎలా ఇచ్చానంటే.. కల్కి మ్యూజిక్ డైరెక్టర్ వ్యాఖ్యలు..

తాజాగా కల్కి సినిమా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Santhosh Narayanan : ప్రభాస్ కల్కి సినిమా రేపు జూన్ 27న రిలీజ్ అవుతుంది. కొన్నాళ్లుగా ఎదురుచూసిన అభిమానులు, ప్రేక్షకులు ఈ భారీ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో చాలా మంది స్టార్ నటీనటులతో హాలీవుడ్ రేంజ్ లో పురాణాలు, సైన్స్ కలిపి తెరకెక్కిన సినిమా కావడం, ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

కల్కి సినిమాలో మహాభారతం ఉందని, మహాభారతంకు కలియుగం అంతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ ఈ కథ రాసాడని ఆల్రెడీ తెలిపాడు. ట్రైలర్ లో కూడా మహాభారతంకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Also Read : Kalki Collections : ‘కల్కి’ సినిమా ఓపెనింగ్ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావొచ్చంటే.. RRR రికార్డ్ బద్దలుకొడుతుందా?

కల్కి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మాట్లాడుతూ.. కల్కి సినిమాలో మహాభారతం పోర్షన్ ఉంది. దానికి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో మహాభారతం పోర్షన్ కి నేనిచ్చిన మ్యూజిక్ మగధీర – బాహుబలి సినిమాలకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ కు నా నివాళి లాంటిది అని అన్నారు. దీంతో కల్కి సినిమాలోని మహాభారతం పోర్షన్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు