OG vs Dhurandhar2: పవన్ vs రణవీర్.. OG మూవీ రికార్డ్స్ ను ధురంధర్ 2 బ్రేక్ చేస్తుందా?
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ను దురంధర్ 2(OG vs Dhurandhar2) సినిమా బ్రేక్ చేస్తుందా?
Will Durandhar 2 break OG advance sales records?
- OG, ధురంధర్ 2 మధ్య ఆసక్తికర పోటీ
- అడ్వాన్స్ సేల్స్ లో ఓజీనే టాప్
- ధురంధర్ 2 ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా
OG vs Dhurandhar2; ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ లెక్కల యుద్ధం మొదలయ్యింది. ఒకవైపు టాలీవుడ్ నుంచి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనివినీ ఎరుగని రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ మాస్ యాక్షన్ సీక్వెల్ ‘ధురంధర్ 2’ ఆ రికార్డులను సవాల్ విసురుతోంది. మరీ ముఖ్యంగా.. పెయిడ్ ప్రివ్యూస్ ద్వారా ‘OG’ సాధించిన రూ.30 కోట్ల వసూళ్ల మార్కును ‘ధురంధర్ 2’ అధిగమిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన OG సినిమా అడ్వాన్స్ సేల్స్, పెయిడ్ ప్రివ్యూస్ ద్వారా ఇండియాలోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేవలం ప్రివ్యూ షోల ద్వారానే ఏకంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆల్-టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ క్రేజ్, సుజీత్ స్టైలీష్ టేకింగ్ తోడవ్వడంతో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన మొదటి తెలుగు చిత్రంగా OG(OG vs Dhurandhar2) నిలిచింది.
Allu Arjun: రికార్డ్స్ అలర్ట్.. AA22 నుంచి బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ
ఇక రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దురంధర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. అది కూడా పాన్ ఇండియా లెవల్లో. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే 1.2 లక్షల టికెట్లను అమ్ముడయ్యాయి. కేవలం వాటితోనే, దాదాపు రూ.10 కోట్ల వసూళ్లను రాబట్టింది ఈ మూవీ.
ప్రస్తుతం ఈ సినిమా అడ్వాన్స్ కలెక్షన్లు రూ.18.11 కోట్లకు చేరుకున్నట్టు సమాచారం. విడుదలకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారా ఇది ‘OG’ నెలకొల్పిన రూ.30 కోట్ల రికార్డును బ్రేక్ చేయడం సాధ్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ధురంధర్ 2 సినిమా ఇప్పటికే బాలీవుడ్ హిట్ సినిమా ‘స్త్రీ 2’ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ నేపధ్యంలోనే అత్యధిక అడ్వాన్స్ సేల్స్ సాధించిన హిందీ సినిమాగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
