Allu Arjun: రికార్డ్స్ అలర్ట్.. AA22 నుంచి బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ
అల్లు అర్జున్(Allu Arjun) బర్త్ డే కి బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న AA22xA6 మూవీ టీం.
AA22xA6 movie title teaser releasing on the occasion of allu arjun birthday
- అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్
- బన్నీ బర్త్ డేకి సోషల్ మీడియా షేక్
- ఒకేరోజు రెండు బ్లాక్ బస్టర్ అప్డేట్స్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. దానికి కారణం, మేకర్స్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో, సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తుండటమే. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు, తాజాగా అల్లు అర్జున్ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారట. నిజానికి, అల్లు అర్జున్ బర్త్ డే అంటే ఆయన అభిమానులకు పండగే. అందుకే, ఈసారి అట్లీతో చేయబోయే సినిమా టైటిల్ టీజర్ తో పాటు ‘పుష్ప 3’ అప్డేట్ కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడట.
Varanasi: ‘వారణాసి’లో నాటు నాటు రేంజ్ సెన్సేషన్.. లాటిన్ బీట్స్‌తో అదరగొట్టనున్న కొత్త సాంగ్
ఇక AA22 టైటిల్ టీజర్ విషయానికి వస్తే, అట్లీ మార్క్ స్టైలిష్ యాక్షన్, అల్లు అర్జున్(Allu Arjun) మాస్ అప్పీల్ సెట్ చేస్తూ అత్యంత స్టైలిష్‌గా, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో డిజైన్ చేస్తున్నారట. ఇక ఈ టీజర్ కి సాయి అభ్యంకర్ ఇచ్చిన మ్యూజిక్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉండనుందట. ఈ టీజర్ రిలీజ్ తరువాత AA 22 సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపు అవడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నారు.
కాబట్టి, ఏప్రిల్ 8న రాబోయే ఈ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఖాయంగా కనిపిస్తోంది. పుష్పరాజ్ మాస్ లుక్ తరువాత అల్లు అర్జున్ ఏ అవతారంలో కనిపించబోతున్నాడు అనేది తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే. ఇక అల్లు అర్జున్, అట్లీ సినిమాలో దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమాలో విలన్ గా నటిస్తుంది అనే న్యూస్ కూడా వైరల్ అవుతున్నాయి. త్వరలోనే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
