Hyundai Creta SUV 2024 : కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ క్రెటా వచ్చేస్తోంది.. 2024 లాంచ్ డేట్, ధర, ఫీచర్లు, డిజైన్ పూర్తి వివరాలు మీకోసం..

Hyundai Creta SUV 2024 : భారత మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta SUV) కారు వచ్చేస్తోంది. 2024లో ఈ కొత్త హ్యుందాయ్ (Hyundai Creta) లాంచ్ కానుంది. ఫీచర్లు, ధర, డిజైన్ వివరాలను ఓసారి లుక్కేయండి.

Hyundai Creta SUV 2024 : ప్రముఖ మిడ్-సైజ్ SUV హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta SUV) 2024 మోడల్‌తో ఫేస్‌లిఫ్ట్‌ను పొందేందుకు రెడీగా ఉంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 2023 కియా సెల్టోస్ వంటి కొత్త మోడల్‌లు మార్కెట్లోకి ప్రవేశించగా.. హ్యుందాయ్ క్రెటా స్పోర్టీ డిజైన్, అధునాతన ఫీచర్లు, మల్టీ పవర్‌ట్రెయిన్‌లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆప్షన్లు, బ్రాండ్ వాల్యూతో హ్యుందాయ్ మోటార్ ఇండియా మరింత ముందుకు దూసుకెళ్తోంది.

Read Also : Tech Tips in Telugu : మీ ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో మల్టీపుల్ లింక్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

హ్యుందాయ్ క్రెటా 2024 అనేక అప్‌డేట్‌లను కలిగి ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫ్రంట్ ఎండ్ హ్యుందాయ్ టక్సన్, కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బంపర్ నుంచి ప్రేరణ పొందిన కొత్త గ్రిల్‌తో రీడిజైన్ అయింది. ఈ వెహికల్ కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. అయితే, బ్యాక్ సైడ్ కొత్త LED టెయిల్‌ల్యాంప్‌లు, రిస్టోర్ బంపర్ యాడ్ చేయనుంది.

లోపల, క్యాబిన్ స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌కి సంబంధించిన అప్‌డేట్‌లతో సహా ముఖ్యమైన మార్పులను చూడవచ్చని భావిస్తున్నారు. SUVకి అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ (ADAS) కూడా యాడ్ చేయనుంది.

New Hyundai Creta SUV Car 2024 Launch date

హ్యుందాయ్ క్రెటా 2024 లాంచ్ ఎప్పుడంటే? :
ఇంజన్ ఆప్షన్ల పరంగా.. హ్యుందాయ్ క్రెటా 2024 కియా సెల్టోస్ 1.5-లీటర్ టర్బో-GDi పెట్రోల్ ఇంజన్ (160PS/253Nm), 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ (115PS/144Nm) వంటి అదే ఆప్షన్లను అందిస్తుందని భావిస్తున్నారు. 1.5-లీటర్ CRDi VGT డీజిల్ ఇంజన్ (116PS/250Nm) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ MT, 6-స్పీడ్ iMT, IVT, 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ AT ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా 2024 లాంచ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో లాంచ్ అవుతుందని అంచనా.

ప్రస్తుత క్రెటా మోడల్ ధర రూ. 10.87 లక్షల నుంచి రూ. 19.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, హ్యుందాయ్ క్రెటా 2024 విస్తృతమైన అప్‌డేట్‌ల కారణంగా ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. లాంచ్ తర్వాత హ్యుందాయ్ క్రెటా 2024 మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా కుషాక్,ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటితో పోటీపడనుంది.

Read Also : Tata Safari Harrier Bookings : కొత్త కారు కొంటున్నారా? టాటా సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. రూ.25వేలకే బుక్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు