Xiaomi 12 కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

షియోమీ నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. క్వాల్ కామ్ న్యూ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ సహా పలు అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Xiaomi 12 : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. క్వాల్ కామ్ న్యూ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ సహా పలు అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్ కు ముందే ఈ డివైజ్ కు సంబంధించి ఫీచర్లు లీకయ్యాయి. రాబోయే షియోమీ 12లో మెరుగైన కెమెరా మాడ్యూల్‌తో పాటు ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ వంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయని చైనా సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ వీబో (Weibo) వెల్లడించింది. 2021 ఏడాది చివ‌రిలో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. షియోమి 11 కంటే మెరుగైన కెమెరాతో పాటు క్వాల్‌కాం అప్‌క‌మింగ్ ప్రాసెస‌ర్‌తో రానుంది.

అంతేకాదు.. 100W ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉందని చెబుతున్నారు. షియోమి 11Tpro మాదిరిగానే Xiaomi 12 పోలి ఉంటుందని నివేదిక వెల్లడించింది. అదనంగా, ఫోన్ పెద్ద బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుందని సూచిస్తుంది. హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌ల పరంగా చూస్తే.. సిరీస్ బేస్ మోడల్ Xiaomi 11 అల్ట్రా కంటే తక్కువగా ఉంటుంది. Xiaomi 11pro కంటే వేగంగా పనిచేస్తుంది. గత ఏడాదిలో 108-MP సెన్సార్‌తో Xiaomi 11 అల్ట్రాలో వచ్చింది. కానీ, ఈ కొత్త 12 మోడల్ ఫోన్‌లో 50MP సెన్సార్‌ను కలిగి ఉంది.

Xiaomi 11 అల్ట్రాలో 48-MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 48-MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. Xiaomi 12 కెమెరా మాడ్యూల్‌లో అవే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. కొత్త లీక్ ప్రకారం.. Xiaomi 12లో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. Xiaomi 12 స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంటుంది. మొబైల్ ఫోన్‌ల కోసం కంపెనీ కొత్త ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను తీసుకురానుంది. గత ఏడాదిలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888తో ఇదే విధమైన ఫీచర్లతో రిలీజ్ అయింది. Mi11 లేదా ఫీచర్లు ఎలా ఉండనున్నాయో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Read Also :  Meta Smartwatch : ఆపిల్‌కు పోటీగా.. ఫేస్‌బుక్ ఫ్రంట్ కెమెరా స్మార్ట్‌వాచ్.. ఫొటో లీక్!

ట్రెండింగ్ వార్తలు