Hazaribag: జార్ఖండ్‭లో ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ బస్సు, 8 మంది మృతి

‘‘జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ‘‘ఒక్కసారిగా ఈ వార్త విని షాకయ్యాను. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని, ఈ విషాదాన్ని భరించే శక్తిని వారి కుటుంబాలకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ముఖ్యమంత్రి సోరెన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Hazaribag: జార్ఖండ్‭లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు, కాగా మరో 12 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని హజారిబాగ్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిందీ సంఘటన. 50 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఒక బస్సులు బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పి నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.

గిరిది జిల్లా నుంచి రాంచీకి వెళ్తోన్న బస్సు.. టాటిఝారియా పోలీస్ స్టేషన్ సమీపంలోని సివన్నె నదిపై ఉన్న బ్రిడ్జిపైకి రాగానే అదుపు తప్పింది. రేలింగ్‭ను ఢీకొట్టి అమాంతం నదిలో పడిపోయింది. కాగా, ఈ ఘటనపై హజారిబాగ్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ రతన్ చోటె మాట్లాడుతూ ‘‘ఇద్దరు ప్రయాణికులు ప్రమాద ఘటనలోనే మరణించారు. నలుగురు ఆసుపత్రికి చేరుకోగానే మరణించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరికొంత మంది పరిస్థితి విషయమంగా ఉండడంతో అత్యుత్తమ చికిత్స నిమిత్తం వారిని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‭కు తరలించాం’’ అని తెలిపారు.

కాగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ‘‘ఒక్కసారిగా ఈ వార్త విని షాకయ్యాను. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని, ఈ విషాదాన్ని భరించే శక్తిని వారి కుటుంబాలకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ముఖ్యమంత్రి సోరెన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లండన్ చేరుకున్న భారత రాష్ట్రపతి

ట్రెండింగ్ వార్తలు