Patolla Govardhan Reddy Murder : పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు.. శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Patolla Govardhan Reddy Murder : పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసుపై 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 2012 డిసెంబర్ 27న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య జరిగింది. ఆయన హత్యపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యఫై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శేషన్నగా పేర్కొన్నారు. 2018 ఫిబ్రవరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న శేషన్నను పోలీసులు ఆరెస్ట్ చేశారు. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి కోర్టు శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.

New Delhi: బ్యాగులో మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం.. మహిళను హత్య చేసి పడేశారా?

అప్పట్లో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముఠాలను నడిపే వ్యక్తుల జీవితాలకు ముగింపు ఇలాగే ఉంటుందేమోనన్నట్లుగా గోవర్ధన్ రెడ్డి హత్య జరిగింది. విప్లవ దేశభక్త పులులు సంస్థ పేరుతో అతను తొలుత పత్రికలకు ప్రకటనలు పంపుతూవుండేవారు.
ఆ విధంగా అతను ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని సెటిల్ మెంట్లు, భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూవుండేవారని ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా పరిటాల రవి హత్య కేసులో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి నిందితుడుగా ఉన్నాడు. అయితే, తగిన ఆధారలు లేకపోవడంతో అతన్ని కోర్టు నిర్దోషిగా ప్నప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లోని చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యాడు. పరిటాల హత్యపై అతను అప్పట్లో సంలచన ప్రకటనలు చేశారు. మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడు మొద్దు శ్రీను హత్యపై కూడా పలు టీవీ చానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు.

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసు.. టీఎస్ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డికి ముగ్గురు అన్నదమ్ముళ్లు, ఒక అక్క ఉన్నారు. అయితే ఓ సోదరుడు ఎప్పుడూ అన్న గోవర్ధన్ రెడ్డి వెంటే ఉండేవాడని అనేవారు. అతను రాయలసీమ ఫాక్షన్ ను అంతం చేస్తానని కూడా ప్రకటన చేయడం శోచనీయం. అతను పలు చోట్ల గాంధీ విగ్రహాలను కూల్చివేశాడు. పార్శిల్ బాంబులు పంపి వ్యాపారులను బెదిరించే వారని ఆరోపణలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు