Husband Kills Wife : భార్య ప్రవర్తనపై అనుమానం-హత్య చేసి పరారైన భర్త

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, భార్యను హత్యచేసి పరారయ్యాడు.

Husband Kills Wife :  భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, భార్యను హత్యచేసి పరారయ్యాడు. తమిళనాడు,చెన్నైలోని మింజూరు వద్ద సెల్లియమ్మన్ కోయిల్ సమీపంలో శనివారం రాత్రి ఒక వివాహిత(20) మృతదేహాన్ని స్ధానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు ఆమె మెడ భాగంపై కమిలినట్లు ఉండి గొంతు  పిసికి   చంపినట్లు గుర్తించారు.

మహిళ ఒంటి మీద నగలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. దీంతో పోలీసులు ఈ హత్య కేవలం  కుటుంబ కలహాల కారణంగానే జరిగి ఉంటుందనే కోణంలో ఆమె భర్తకోసం గాలించసాగారు. బాధితురాలిని మీనా గా గుర్తించారు.

చెన్నైకు చెందిన మీనాకు. ముత్తురాసన్(25) తో వివాహం అయ్యింది. ఇద్దరూ ఒకే భవన నిర్మాణ కంపెనీలో పనిచేస్తుండటంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా…. ముత్తురాసన్ ఉద్యోగ రీత్యా కోల్ కత్తాకు   ట్రాన్సఫర్ అయి వెళ్ళాడు.   అనంతరం భార్య ఆఫీసులో    వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ముత్తురాసన్ కు తెలిసింది.

Also Read : Moderate Rains : తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు

దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ముత్తురాసన్ చెన్నై వచ్చాడు.  ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. చివరికి ఆమె ఉద్యోగం వదిలేసి ముత్తురాసన్ తో కోల్ కత్తా   వెళుతున్నట్లు ఇరుగు పొరుగు వారికి  చెప్పింది.

శనివారం రాత్రి భార్యా భర్తలిద్దరూ   సెల్లియమ్మన్ గుడి వద్దకు వెళ్లారు. అక్కడ ఎక్కువ సేపు గడిపినట్లు స్ధానికులు తెలిపారు. దీంతో పోలీసులు మీనా భర్త ముత్తురాసన్ కోసం గాలిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని పొన్నేరి  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు