జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, 21 మంది మృతి

అఖ్నూర్‌ బస్సు ప్రమాద ఘటన పట్ల విచారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Jammu Kashmir Bus Tragedy (Photo Credit : Google)

Bus Tragedy : జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు  జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో లోయలో పడింది.
ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. మరో 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అఖ్నూర్ సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు మృతదేహాలు తరలించారు. క్షతగాత్రుల్లో ఏడుగురిని అఖ్నూరు ఆస్పత్రికి, మిగతా వారిని జమ్మూలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ప్రయాణికులు జమ్మూ నుంచి రియాసి జిల్లాలోని శివ్ ఖోరీ మందిరానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అఖ్నూర్‌ బస్సు ప్రమాద ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read : రెండేళ్ల కొడుకు కళ్ల ముందే తండ్రి.. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన