Fake digital Arrest Scam : ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్.. హైదరాబాద్ వ్యక్తి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన స్కామర్లు!

Fake digital Arrest Scam : తాజాగా హైదరాబాద్ వాసి స్కామర్ల చేతుల్లో మోసపోయాడు. 20 రోజుల వ్యవధిలో అతడి అకౌంట్ల నుంచి రూ. 1.2 కోట్లు కొట్టేశారు స్కామర్లు.

Fake digital Arrest Scam : స్కామర్లతో జాగ్రత్త.. ఇటీవల కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు స్కామర్లు. పార్శిల్ స్కామ్, ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేర్లతో అమాయకుల నుంచి కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో అనేక మంది చిక్కుకుని భారీగా నష్టపోయారు. తాజాగా హైదరాబాద్ వాసి స్కామర్ల చేతుల్లో మోసపోయాడు. 20 రోజుల వ్యవధిలో అతడి అకౌంట్ల నుంచి రూ. 1.2 కోట్లు కొట్టేశారు స్కామర్లు.

మే 7న అతడికి ఊహించని ఫోన్ కాల్‌ రావడంతో అసలు సమస్య మొదలైంది. ఈ సమయంలో ఒక పోలీసు అధికారిగా స్కామర్లు నటిస్తూ.. అతని పేరు మీద ఉన్న పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఫోన్లో తెలియజేశాడు. నివేదిక ప్రకారం.. ఆరోపించిన అధికారి బాధితుడికి తన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఎలాంటి తప్పులు లేకుండా షేర్ చేయాలని అడిగాడు. 24/7 ఆన్‌లైన్‌లో ఉండమని కోరాడు. ఆ రోజు నుంచి 20 రోజుల్లో తన అకౌంట్లలో నుంచి కోటికి పైగా నగదును కాజేశారు.

Read Also : WhatsApp Users : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ ఫొటోలు, వీడియోలను హైక్వాలిటీతో అప్‌‌లోడ్ చేయొచ్చు

కచ్చితమైన షిప్‌మెంట్, డెలివరీ వివరాలను చెప్పడంతో కాల్ చేసిన వ్యక్తి నిజమైన పోలీసు అధికారిగా నమ్మి బాధితుడు మోసపోయాడు. తాను ఒక తీవ్రమైన చట్టపరమైన సమస్యలో ఉన్నాడని భావించేలా నమ్మించారు. పోలీసులకు సహకరించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.

అందుకే తాను రాబోయే 20 రోజులు ఇంటికే పరిమితమయ్యానని బాధితుడు చెప్పుకొచ్చాడు. సైబర్ నేరగాళ్లు బాధితుడిని నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండాలని డిమాండ్ చేశారు. మొదట్లో, తనకు రూ. 30 లక్షలు పంపాలని చెప్పారు. ప్రతిరోజూ డిమాండ్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 20 రోజులు ముగిసే సమయానికి తన సేవింగ్స్ అకౌంట్లు, క్రెడిట్ కార్డుల నుంచి రూ. 1.2 కోట్లు చెల్లించానని బాధితుడు వాపోయాడు.

దాదాపు 20 రోజుల పాటు బాధితుడు బాత్రూంలో లేదా నిద్రిస్తున్నప్పుడు కూడా తన ఇంటిని వదిలి వెళ్ళలేకపోయాడు. అతని ఫోన్ నుంచి దూరంగా ఉండలేకపోయాడు. తీవ్రమైన ఒత్తిడి , అరెస్టు భయం అతన్ని బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉండేలా చేసింది. తన భార్య, పిల్లలు మానసికంగా కుంగిపోయారు. ఇరుగుపొరుగు వారి సూచనల మేరకు తమను చూసేందుకు అనుమతించలేదు. దాంతో వారంతా ఇంటికే పరిమితమయ్యామని బాధిత వ్యక్తి పేర్కొన్నారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రాగా తన భార్య మద్దతుతో అలాంటి ఆలోచనల నుంచి తొందరగా బయపడ్డాడు.

ఈ స్కామ్ ఏమిటి? :
డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అని పిలిచే ఈ స్కామ్‌లో నేరస్థులు చట్టపరమైన అధికారులుగా నటించి అనుమానాస్పద వ్యక్తుల నుంచి డబ్బును దోచుకోవడానికి భయాందోళన కలిగిస్తారు. అనుమానాస్పద పార్శిల్ ఆధారంగా బాధితుడు నేరం చేశాడని, ఒత్తిడిని పెంచడానికి వారిని ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు ఒంటరిగా ఉంచడం, చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి బాధితుడిని డబ్బు చెల్లించమని తరచుగా డిమాండ్ చేస్తుంటారు.

ఎలా సురక్షితంగా ఉండాలి? :
మీకు కాల్ చేసిన ఫోన్ కాలర్ ఐడెంటిటీని ధృవీకరించండి : ఎల్లప్పుడూ కాలర్ ఐడెంటిటీని స్వతంత్రంగా ధృవీకరించండి. అధికారిక వెబ్‌సైట్‌లు లేదా డాక్యుమెంట్ల నుంచి కాంటాక్టు సమాచారాన్ని ఉపయోగించి అధికారిక సంస్థను నేరుగా సంప్రదించండి.

వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు :
మీరు కాలర్ గుర్తింపు గురించి కచ్చితంగా తెలియకుంటే ఫోన్‌లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు.అత్యవసర అభ్యర్థనలపై సందేహాస్పదంగా ఉండండి. స్కామర్‌లు తరచుగా అత్యవసర భావాన్ని క్రియేట్ చేస్తారు. తక్షణ పేమెంట్ల కోసం ఏవైనా అభ్యర్థనలు లేదా చట్టపరమైన బెదిరింపుల పట్ల సందేహాస్పదంగా ఉండండి.

అనుమానాస్పద మెసేజ్, కాల్స్ రిపోర్టు చేయండి:
ఏవైనా అనుమానాస్పద కాల్‌లు లేదా మెసేజ్ వస్తే వెంటనే పోలీసులకు, మీ బ్యాంకుకు రిపోర్టు చేయండి. సాధారణ స్కామ్ టెక్నిక్‌లపై కూడా అప్‌డేట్ చేస్తూండాలి. స్కామ్‌లను ఎలా గుర్తించాలి?, ప్రతిస్పందించాలనే దానిపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించండి.

Read Also : JEE Advanced 2024 Answer Key : ఈ నెల 2న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఆన్సర్ కీ విడుదల.. పూర్తి వివరాలను ఇలా చెక్ చేయండి!

ట్రెండింగ్ వార్తలు