Nivetha Pethuraj Paruvu Trailer out now
Nivetha Pethuraj Paruvu : హీరోయిన్ నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్ వెబ్ సిరీస్ పరువు. నరేశ్ అగస్త్య, నాగబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది.
జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో బృందం వేగం పెంచింది. అందులో భాగంగా హీరో వరుణ్ తేజ్ ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకోవాలని అనుకున్న జాహ్నవి, విక్రమ్ అనే ప్రేమ జంటకు ఎదురైన సంఘటనలతో ఆద్యంతం ట్రైలర్ ఉత్కంఠను పంచుతోంది. ఏదైనా కానీ నీతో లైఫ్ బాగుంటుంది అనిపిస్తుందని నరేష్ అగస్త్యతో నివేతా పేతురాజ్ చెప్పిన డైలాగ్ బాగుంది. ప్రేమ జంటను చంపడానికి కొందరు కిల్లర్స్ ఎందుకు ప్రయత్నించారు? వారి నుంచి ప్రేమ జంట ఎలా తప్పించుకుంది వంటివి తెలుసుకోవాంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
Manamey Movie : శర్వానంద్ ‘మనమే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో..? గెస్ట్ గా రామ్ చరణ్..?