Manamey Movie : శర్వానంద్ ‘మనమే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో..? గెస్ట్ గా రామ్ చరణ్..?
తాజాగా మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Sharwanand Manamey Movie Pre Release Event Planning at Pithapuram Eith Ram Charan as Guest News Goes Viral
Manamey Movie Pre Release Event : శర్వానంద్(Sharwanand) చివరిగా 2022లో ఒకే ఒక జీవితం సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఇప్పుడు మళ్ళీ రెండేళ్ల తర్వాత ‘మనమే’ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ 35వ సినిమాగా మనమే తెరకెక్కింది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మనమే సినిమా జూన్ 7న రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.
తాజాగా నిన్నే మనమే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. పెళ్లి కానీ ఓ జంట ఒక బాబుని పెంచాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని లవ్, కామెడీ , మ్యూజికల్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. అయితే మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ వస్తాడని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా శర్వా ఇండైరెక్ట్ గా చరణ్ వస్తాడని హింట్ ఇచ్చాడు.
Also Read : Manamey Trailer : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది.. పిల్లల్ని పెంచడం అంటే ఈజీ కాదు..
తాజాగా మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో చేస్తారని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఈ ఊరి పేరు నేషనల్ వైడ్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే పవన్ గెలుస్తాడని నిన్న(జూన్ 1) వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో జూన్ 5న పిఠాపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టి దానికి రామ్ చరణ్ ని గెస్ట్ గా పిలిస్తే సినిమాకు హైప్ ఓ రేంజ్ లో వస్తుందని భావిస్తున్నట్టు సమాచారం.
మరి నిజంగానే మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేస్తారా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. అయితే చరణ్ మాత్రం గెస్ట్ గా కంఫర్మ్ అని అంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.