Aaron Jones : ఆరోన్ జోన్స్ సిక్స‌ర్ల వ‌ర్షం.. యువ‌రాజ్ సింగ్ రికార్డు క‌నుమ‌రుగు.. క్రిస్‌గేల్ రికార్డు ప‌దిలం

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ‌మైంది.

PIC credit : ICC

Aaron Jones hit 10 sixes : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో అమెరికా, కెన‌డా జ‌ట్లు డ‌ల్లాస్ వేదిక‌గా త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో అమెరికా 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది. గెలుపు ఆశ‌లే లేని స్థితి నుంచి యూఎస్ఏ విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కెన‌డా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. నవనీత్ దాలివాల్ (61; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ కిర్టన్ (51; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. అమెరికా బౌల‌ర్ల‌లో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరి అండర్సన్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. అనంతరం ఆరోన్ జోన్స్ (94 నాటౌట్; 40 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లు), ఆండ్రిస్ గోస్ (65; 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో ల‌క్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Team India : ఐపీఎల్ గొడ‌వ‌లు ఇక్క‌డొద్దు..! కెప్టెన్ ఎవ‌రో అంద‌రికి తెలుసు.. మాజీ క్రికెట‌ర్లు

ఆరోన్స్ అరుదైన ఘ‌న‌త‌..

అమెరికా ఆట‌గాడు ఆరోన్ జోన్స్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ ఇన్నింగ్స్‌ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. కెన‌డాతో మ్యాచ్‌లో జోన్స్ 10 సిక్స‌ర్లు బాదాడు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడి రికార్డు వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్‌గేల్ పేరిట ఉంది. గేల్ ఇంగ్లాండ్ పై 11 సిక్స‌ర్లు, ద‌క్షిణాప్రికా 10 సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌రువాత రిలీరొసో (8), యువ‌రాజ్ సింగ్ (7), డేవిడ్ వార్న‌ర్ (7) ఉన్నారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు..

క్రిస్‌ గేల్ (వెస్టిండీస్‌) – 2016లో ఇంగ్లాండ్ పై – 11 సిక్స‌ర్లు
క్రిస్‌ గేల్ (వెస్టిండీస్ – 2007లో ద‌క్షిణాఫ్రికా పై – 10 సిక్స‌ర్లు
ఆరోన్‌ జోన్స్ (అమెరికా) – 2024లో కెన‌డా పై – 10 సిక్స‌ర్లు
రిలీ రొసోవ్ (ద‌క్షిణాఫ్రికా) – 2022లో బంగ్లాదేశ్ పై – 8 సిక్స‌ర్లు
యువ‌రాజ్ సింగ్ (భార‌త్) – 2007లో ఇంగ్లాండ్ పై – 7 సిక్స‌ర్లు

Rohit Sharma : అమెరికా పోలీసులు ఇలా ఉన్నారేంట్రా బాబు.. ఓ వైపు రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌ని చెబుతున్నా..!

ట్రెండింగ్ వార్తలు