The Nobel Peace Prize 2022: బెలారూస్ మానవ హక్కుల కార్యకర్తతో పాటు మరో 2 సంస్థలకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి

బెలారూస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బిలియాట్స్కీతో పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబరిటీస్ కు సంయుక్తంగా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది. తమ దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ అందిస్తోన్న సేవలకు గానూ ఈ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.

The Nobel Peace Prize 2022: బెలారూస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బిలియాట్స్కీతో పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ కు సంయుక్తంగా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది. తమ దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ అందిస్తోన్న సేవలకు గానూ ఈ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.

అలెస్ బిలియాట్స్కీతో పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఎన్నో ఏళ్లుగా అధికారాన్ని విమర్శించే హక్కును ప్రచారం చేయడంతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది.

యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం వంటివాటిపై పత్రాలు సమర్పించడంలో ఎంతగానో కృషి చేశారని పేర్కొంది. శాంతి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో పౌర సమాజ ప్రాముఖ్యతను చాటి చెప్పారని నోబెల్ కమిటీ చెప్పింది. ఆయా కారణాల వల్ల అలెస్ బిలియాట్స్కీతో పాటు పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ కు సంయుక్తంగా ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు