Team India Video: సెమీఫైనల్‌కు సిద్ధమవుతున్న టీమిండియా.. గయానాలో రోహిత్ సేన

టీమిండియాకు అక్కడి విమానాశ్రయంలో అభిమానులు స్వాగతం పలికారు

టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా గురువారం ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడనుంది. దీంతో టీమిండియా గుయానాకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ అక్షర్ పటేల్ తో పాటు ఇతర ఆటగాళ్లు గయానా చేరుకున్నారని తెలిపింది.

టీమిండియాకు అక్కడి విమానాశ్రయంలో అభిమానులు స్వాగతం పలికారు. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా పూర్తి స్థాయిలో ఫామ్ లో ఉంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచులోనూ టీమిండియా ఓడిపోలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులోనూ టీమిండియా 27 పరుగుల తేడాతో గెలుపొందింది. మరోవైపు సెమీఫైనల్ మ్యాచు ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు కూడా గయానా చేరుకుంది.

టీ20 ప్రపంచ కప్ తొలిసారి 2007లో నిర్వహించారు. ఆ టోర్నీలో టీమిండియా కప్ కొట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా గెలుచుకోలేదు. సెమీ ఫైనల్లో గురువారం ఉదయం 6 గంటలకు సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఆడనున్నాయి. రెండో సెమీఫైనల్లో గురువారం రాత్రి 8 గంటలకు టీమిండియా, ఇంగ్లండ్ తలపడతాయి.

ట్రెండింగ్ వార్తలు