అమెరికా, కెనడా నుంచి నిపుణులు వచ్చేస్తున్నారు.. పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితులపై లోతైన అధ్యయనం

మెయిన్ డ్యామ్ లో భాగంగా నిర్మించిన డయాప్రమ్ వాల్ మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. దీనికి మరమ్మత్తులా? కొత్తగా మళ్లీ నిర్మించాలా? అన్నది నిపుణులు తేల్చబోతున్నారు.

Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను ప్రయారిటీగా తీసుకుని పని చేస్తున్నారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఓ అడుగు ముందుకేసింది. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపుతోంది. ఈ నెల 29న అమెరికా, కెనడా నుంచి నలుగురు నిపుణులు పోలవరానికి రానున్నారు. అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం పరిస్థితులను అధ్యయనం చేయనుంది.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో జలశక్తి అధికారులతో చర్చలు జరిపారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పందించి చర్యలను స్పీడప్ చేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు.. డ్యామ్ నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి అధ్యయనం చేయబోతున్నారు. ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి.

ఇక అప్పర్ కాపర్ డ్యామ్ లో సీపేజీ వస్తోంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాల్ గా ఉండబోతోంది. మెయిన్ డ్యామ్ లో భాగంగా నిర్మించిన డయాప్రమ్ వాల్ మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. దీనికి మరమ్మత్తులా? కొత్తగా మళ్లీ నిర్మించాలా? అన్నది నిపుణులు తేల్చబోతున్నారు. మెయిన్ డ్యామ్ నిర్మించే చోట కొన్ని సవాళ్లు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలు చూపేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ పోలవరం వస్తోంది.

Also Read : త్వరలోనే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం?- ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు