128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు ఏర్పాటు.. విద్యార్థులకు స్మార్ట్ కార్డు.. ఇకపై హ్యాపీగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు.. 

ఒక్కో గురుకులంలో 6 పే ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సవిత తెలిపారు. స్మార్ట్ కార్డుతో తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు ఏర్పాటు.. విద్యార్థులకు స్మార్ట్ కార్డు.. ఇకపై హ్యాపీగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు.. 

Pay Phones

Updated On : September 7, 2025 / 3:17 PM IST

Pay Phones: ఆంధ్రప్రదేశ్‌లో గురుకులాల్లో చదివే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ఫోన్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. ఇకపై ఆ సమస్యలు ఉండవు. కొత్తగా 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నారు.

సోమవారం పెనుకొండ ఎంజేపీలో పే ఫోన్లను ప్రారంభించనున్నారు మంత్రి సవిత. ఒక్కో గురుకులంలో 6 పే ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సవిత తెలిపారు. స్మార్ట్ కార్డుతో తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

Also Read: ఆ ఉద్యోగులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.1.6 కోట్ల వరకు ఇన్సురెన్స్

స్మార్ట్ కార్డుకు రీఛార్జీ బాధ్యత విద్యార్థులదే. తల్లిదండ్రులు సూచించిన 4 నంబర్లకు మాత్రమే ఫోన్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి సవిత తెలిపారు. (Pay Phones)

ఇంతకు ముందు వరకు తల్లిదండ్రులు ఏదైనా అత్యవసరం ఉంటే టీచర్‌ల ఫోన్‌లకు కాల్ చేసేవారు. అలాగే, పిల్లలతో మాట్లాడాలంటే తల్లిదండ్రులు హాస్టల్‌కు రావాల్సి వచ్చేది. ఇప్పుడు కల్పిస్తున్న ఫోన్ల సౌకర్యం ద్వారా విద్యార్థులు ఇష్టం వచ్చినప్పుడల్లా తమ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు.