SBI insurance cover: ఆ ఉద్యోగులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. రూ.1.6 కోట్ల వరకు ఇన్సురెన్స్
ఉచిత ఇన్సురెన్స్ ప్రయోజనాల పూర్తి వివరాలు చూడండి..

SBI
SBI insurance cover: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్, ఎస్‌బీఐతో మధ్య ఓ ఒప్పందం (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ – ఎంవోయూ) కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న రైల్వే ఉద్యోగులకు దాదాపు రూ.కోటి వ్యక్తిగత ప్రమాద కవర్ (శాశ్వత సంపూర్ణ అంగవైకల్యం) అందించనుంది. అంటే దురదృష్టవశాత్తు ఉద్యోగి ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం వచ్చినా లేదా మృతిచెందినా ఆ ఎంప్లాయీ కుటుంబానికి బీమా ఇస్తారు.
గతంలో ఈ ఇన్సురెన్స్ చాలా తక్కువగా (రూ.1.20 లక్షలు, రూ.60,000, రూ.30,000 – గ్రూప్ ఏ, బీ, సీ ఉద్యోగులకు) ఉండేది. ఇప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం రైల్వే ఉద్యోగుల వ్యక్తిగత ప్రమాద కవర్ ఏకంగా రూ.కోటికి చేరింది.
ప్రమాదం కారణంగా మృతి చెందితే ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి అందుతుంది. అదనంగా, ఎస్‌బీఐలో శాలసీ అకౌంటర్ ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద కవర్ (శాశ్వత పాక్షిక అంగవైకల్యం) రూ.80 లక్షలు వరకు ఎస్‌బీఐ ఇవ్వనుంది.
Also Read: ఆర్మీ వండర్ ఫుల్ ఆపరేషన్.. డ్రోన్ సాయంతో మనిషిని ఎలా కాపాడారో చూడండి..
ఎయిర్ యాక్సిడెంట్ (విమాన ప్రమాద) కవర్
ఎస్‌బీఐ రైల్వే ఉద్యోగులకు రూ.1.6 కోట్లు ఎయిర్ యాక్సిడెంట్ (డెత్) కవర్ అందిస్తుంది.
అంతేకాదు, రూపే డెబిట్ కార్డు ద్వారా రూ.కోటి వరకు అదనపు కవర్ అందుతుంది.
నేచురల్ డెత్ కవర్
ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ మాత్రమే ఉన్న ఉద్యోగులకు ప్రీమియం లేకుండానే రూ.10 లక్షల నేచురల్ డెత్ కవర్ ఇస్తుంది.
లబ్ధిదారులు
దాదాపు 7 లక్షల రైల్వే ఉద్యోగులకు ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నాయని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. వీరు లబ్ధిదారులు అవుతారు.
ఉచిత ఇన్సురెన్స్ ప్రయోజనాల పూర్తి వివరాలు
ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ (డెత్): రూ.1.60 కోట్లు + రూపే డెబిట్ కార్డుపై రూ.కోటి అదనపు కవర్
వ్యక్తిగత ప్రమాదం (శాశ్వత సంపూర్ణ అంగవైకల్యం): రూ.కోటి
వ్యక్తిగత ప్రమాదం (శాశ్వత పాక్షిక అంగవైకల్యం): రూ.80 లక్షల వరకు
ఎస్‌బీఐ డెబిట్ కార్డులపై అదనపు ఇన్సురెన్స్ కవర్లు
ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం
వ్యక్తిగత ప్రమాద ఇన్సురెన్స్ (డెత్) – నాన్ ఎయిర్: డెబిట్ కార్డు హోల్డర్ నాన్ ఎయిర్ ప్రమాదంలో మరణిస్తే, అతడు వాడే కార్డు రకానికి అనుగుణంగా కవర్ ఉంటుంది.
ఈ కవర్ అమలులోకి రావాలంటే ప్రమాదానికి ముందు 90 రోజుల్లో కనీసం ఒక ఆర్థిక లావాదేవీ (ATM/PoS/eCom) జరగాలి.
వ్యక్తిగత ఎయిర్ ప్రమాద ఇన్సురెన్స్ (డెత్): ఎయిర్ ప్రమాదం(విమాన ప్రయాణంలో జరిగే ప్రమాదం)లో మరణిస్తే కవర్ వర్తిస్తుంది.
డెబిట్ కార్డు వారీగా కవర్ వివరాలు
ఎస్‌బీఐ గోల్డ్ (మాస్టర్‌కార్డ్/వీసా): నాన్ ఎయిర్ రూ.2,00,000.. ఎయిర్ రూ.4,00,000
ఎస్‌బీఐ ప్లాటినమ్ (మాస్టర్‌కార్డ్/వీసా): నాన్ ఎయిర్ రూ.5,00,000.. ఎయిర్ రూ.10,00,000
ఎస్‌బీఐ ప్రైడ్ (బిజినెస్ డెబిట్) (మాస్టర్‌కార్డ్/వీసా): నాన్ ఎయిర్ రూ.2,00,000.. ఎయిర్ రూ.4,00,000
ఎస్‌బీఐ ప్రీమియం (బిజినెస్ డెబిట్) (మాస్టర్‌కార్డ్/వీసా): నాన్ ఎయిర్ రూ.5,00,000.. ఎయిర్ రూ.10,00,000
ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్/మాస్టర్‌కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డు: నాన్ ఎయిర్ రూ.10,00,000.. ఎయిర్ రూ.20,00,000