Top Selling Cars 2026 : కొత్త కారు కొంటున్నారా? ఫిబ్రవరిలో ఈ కార్లను ఎగబడి కొనేశారు భయ్యా.. టాప్ 10 సెల్లింగ్ SUV కార్లు ఇవే
Top 10 Highest-Selling Cars : గత ఫిబ్రవరిలో నెక్సాన్, పంచ్ టాప్ 10లో అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా, మహీంద్రా స్కార్పియో, మారుతి విక్టోరిస్, మహీంద్రా థార్, హ్యుందాయ్ వెన్యూ, కియా సెల్టోస్ కార్లు భారీగా అమ్ముడయ్యాయి.
Top Selling Cars 2026
- ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 SUV కార్లు
- భారీ సంఖ్యలో అమ్ముడైన టాటా మోటార్స్, నెక్సూర్, టాటా పంచ్
- అన్ని కార్ల మోడల్స్ కు ఫుల్ డిమాండ్, హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి
- అమ్మకాల చార్టులలో టాప్ ప్లేసులో నిలిచిన SUV మోడల్ కార్లు
Top 10 Highest-Selling Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఫిబ్రవరి 2026లో భారత మార్కెట్లో ప్యాసెంజర్ వాహన అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. 28 రోజులే అయినా అన్ని కేటగిరీల్లో కార్ల అమ్మకాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
హై-వాల్యూమ్ మోడల్‌లు, బుకింగ్‌లు భారీగా నమోదయ్యాయి. SUV మోడల్ కార్లు మాత్రం అమ్మకాల చార్టులలో టాప్ ప్లేసులో నిలిచాయి. కాంపాక్ట్, మిడ్-సైజ్ SUV మోడల్స్ కూడా నెలవారీ ర్యాంకింగ్‌లలో ఆధిపత్యం చలాయించాయి. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు కూడా స్థిరమైన వాల్యూమ్లను నమోదు చేశాయి.
టాటా మోటార్స్ SUV మోడల్స్ దేశవ్యాప్తంగా బాగా అమ్ముడవుతున్నాయి. ఫిబ్రవరిలో నెక్సాన్, పంచ్ టాప్ 10లో అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తరువాత, హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా, మహీంద్రా స్కార్పియో, మారుతి విక్టోరిస్, మహీంద్రా థార్, హ్యుందాయ్ వెన్యూ, కియా సెల్టోస్ వంటి కార్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
గత నెలలో టాటా మోటార్స్ నెక్సూర్, పంచ్ పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆ తరువాత, హ్యుందాయ్ క్రెటా, వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, విక్టోరిస్, మహీంద్రా స్కార్పియో, థార్ అలాగే కియా సెల్టోస్ వంటి SUVలు ఉన్నాయి. ఏయే బ్రాండ్ల కారు అమ్మకాలు ఎలా ఉన్నాయి? ఫిబ్రవరి 2026లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు, SUVలను ఓసారి పరిశీలిద్దాం..
1. టాటా నెక్సాన్ :
ఫిబ్రవరి 2026లో అమ్మకాల చార్టులో టాటా నెక్సాన్ రేంజ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నెక్సాన్ ఈవీ కూడా ఉంది. మొత్తం సబ్-కాంపాక్ట్ SUV లైనప్ 19,430 యూనిట్లను నమోదు చేసింది.
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు: 19,430 యూనిట్లు
- ఫిబ్రవరి 2025లో అమ్మకాలు: 15,349 యూనిట్లు
- వార్షిక వృద్ధి: 27శాతం
2. మారుతి సుజుకి డిజైర్ :
ఫిబ్రవరి 2026లో మారుతి సుజుకి డిజైర్ రెండో స్థానాన్ని దక్కించుకుంది, మొత్తం డిస్పాచ్‌లు 19,326 యూనిట్లకు చేరుకున్నాయి.
3. టాటా పంచ్
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు: 18,748 యూనిట్లు
- ఫిబ్రవరి 2025లో అమ్మకాలు: 14,559 యూనిట్లు
- వార్షిక వృద్ధి: 29శాతం
4. హ్యుందాయ్ క్రెటా
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు: 17,938 యూనిట్లు
- ఫిబ్రవరి 2025లో అమ్మకాలు: 16,317 యూనిట్లు
- వార్షిక వృద్ధి: 10శాతం
5. మారుతి సుజుకి బ్రెజ్జా
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు: 17,863 యూనిట్లు
- ఫిబ్రవరి 2025లో అమ్మకాలు: 15,392 యూనిట్లు
- వార్షిక వృద్ధి: 16శాతం
6. మహీంద్రా స్కార్పియో
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు: 14,665 యూనిట్లు
- ఫిబ్రవరి 2025లో అమ్మకాలు: 13,618 యూనిట్లు
- వార్షిక వృద్ధి: 8 శాతం
7. మారుతి సుజుకి ఫ్రాంక్స్
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు: 13,898 యూనిట్లు
- ఫిబ్రవరి 2025లో అమ్మకాలు: 21,461 యూనిట్లు
- వార్షిక వృద్ధి : 35శాతం
8. మారుతి సుజుకి విక్టోరిస్
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు: 13,021 యూనిట్లు
9. మహీంద్రా థార్
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు: 11,047 యూనిట్లు
- ఫిబ్రవరి 2025లో అమ్మకాలు: 9,248 యూనిట్లు
- వార్షిక వృద్ధి: 19శాతం
10. హ్యుందాయ్ వెన్యూ
- ఫిబ్రవరి 2026లో అమ్మకాలు : 10,494 యూనిట్లు
- ఫిబ్రవరి 2025లో 10,125 యూనిట్ల అమ్మకాలు
- వార్షిక వృద్ధి : 4 శాతం
11. కియా సెల్టోస్ :
- ఫిబ్రవరి 2026లో 10,308 యూనిట్లు అమ్మకాలు
- ఫిబ్రవరి 2025లో 6,446 యూనిట్లు అమ్మకాలు
- వార్షిక వృద్ధి : 60 శాతం
