వైసీపీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులపై హైకోర్టు స్టేటస్ కో

YSRCP Buildings: పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

AP High Court

వైసీపీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. గురువారం వరకు యథాతథంగా ఉంచాలని చెప్పింది. అలాగే, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.

కాగా, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2 ఎకరాల భూమిలో నిర్మాణంలోని వైసీపీ కార్యాలయాన్ని అనుమతులు లేవంటూ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా పలు జిల్లాల్లో చర్యలు చేపట్టారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కక్షతోనే టీడీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ కూల్చివేతలను నియంతృత్వ చర్యలుగా అభివర్ణిస్తున్నారు.

తాడేపల్లి వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశాక విశాఖలోని ఎండాడలో వైసీపీ నిర్మించిన పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు అందాయి. దాన్ని కూడా అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని అధికారులు చెప్పారు. ఏడు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని జీవీఎంసీ చెప్పింది. మరోవైపు, అనకాపల్లి జిల్లా ఆఫీసు నిర్మాణంపైనా వివాదం కొనసాగుతోంది.

Also Read: వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్.. పిటిషన్లు కొట్టివేత.. అరెస్టు