Modi Landed in Tokyo: జపాన్ చేరుకున్నానంటూ ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తెల్లవారుజామున జపాన్ చేరుకున్నారు. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవాళ టోక్యోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలు టోక్యో వెళ్లారు. అంతేగాక, దాదాపు 100 దేశాల ప్రతినిధులు అబే అంత్య క్రియలకు హాజరవుతారు. జపాన్ చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Modi Landed in Tokyo: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తెల్లవారుజామున జపాన్ చేరుకున్నారు. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవాళ టోక్యోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలు టోక్యో వెళ్లారు. అంతేగాక, దాదాపు 100 దేశాల ప్రతినిధులు అబే అంత్య క్రియలకు హాజరవుతారు. జపాన్ చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

టోక్యో చేరుకున్నానని పేర్కొంటూ విమానం దిగుతుండగా తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అంతకు ముందు కూడా ఆయన ట్విటర్ లో వివరాలు తెలిపారు. జపాన్‌ మాజీ ప్రధాని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు టోక్యో వెళ్తున్నానని, ఆయన భారత్ కు ఆత్మీయ మిత్రుడని అన్నారు. షింజో అబే జపాన్ లో గొప్ప నేతగా పేరుగాంచిన విషయం తెలిసిందే.

జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారు. అలాగే, భారత్‌-జపాన్‌ స్నేహ బంధం మరింత దృఢంగా మారడానికి ఆయన కీలకపాత్ర పోషించారు. మోదీ జపాన్ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చించనున్నారు. కాగా, షింజో అబే జూలై 8న ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొనగా ఆయనను దుండగులు కాల్చి హత్య చేశారు.

200-Year-Old Jackfruit Tree: తమిళనాడులో 200 ఏళ్ల పనసచెట్టు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు