Dry Immersion Study: అంతరిక్షంలో మహిళల శరీరం తట్టుకోగలదా? వాటర్ బెడ్‌తో ప్రయోగం!

అంతరిక్షంలో మహిళల శరీరంపై ఎంతవరకు ప్రభావం ఉంటుందో అర్థం చేసుకునేందుకు వాటర్ బెడ్లతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో 20 మంది మహిళలు పాల్గొన్నారు.

Effects of space on female body : అంతరిక్షంలో మహిళా వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా? అంతరిక్ష వాతావరణంలో మహిళల శరీరం తట్టుకోగలదా? పురుషులతో పోలిస్తే.. మహిళల్లో ప్రతికూలతలు ఎలా ఉంటాయి? అంతరిక్ష వాతావరణానికి అలవాటు పడటానికి పురుషులు, మహిళలకు కొంత సమయం పడుతుంది. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మహిళల్లో ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంటుంది. శరీరపరమైన, హార్మోన్ల తేడాల వల్లే ఇలా జరుగుతుందా అనేది తెలియదు. ఈ విషయంలో లోతుగా అర్థం చేసుకుంటే దీర్ఘకాలంలో అంతరిక్షంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన ఏర్పడుతుంది. ఇందులో భాగంగానే అంతరిక్షంలో మహిళల శరీరంపై ఎంతవరకు ప్రభావం ఉంటుందో అర్థం చేసుకునేందుకు వాటర్ బెడ్లతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో 20 మంది మహిళలు పాల్గొనగా.. ఐదురోజుల పాటు అంతరిక్ష వాతావరణం ఉండేలా వాటర్ బెడ్లను ఏర్పాటు చేశారు. ఆ వాటర్ బెడ్లపై ఐదు రోజులు పాటు పడుకోవాల్సి ఉంటుంది. మహిళల శరీరంపై అంతరిక్ష ప్రయాణ ప్రభావాలను ఈ అధ్యయనంలో విశ్లేషించనున్నారు.
Mumbai : కోవిడ్ పేరు చెప్పి…రూ. 1.3 కోట్లు కొట్టేసిన తల్లీ కూతుళ్లు

ప్రస్తుతం అంతరిక్ష ప్రయాణం వాణిజ్యపరంగా మారిపోతోంది. రాబోయే సంవత్సరాల్లో ఆర్టెమిస్ మిషన్‌లతో భూ ఉపరితలం నుంచి చంద్రునిపైకి వెళ్లేందుకు ప్రయోగాలు కొనసాగుతున్నాయి. పురుష వ్యోమగాములు చంద్రునిపై అడుగుపెట్టి తిరిగి వచ్చారు. ఆ తర్వాత చంద్రుడిపైకి మొదటి మహిళా వ్యోమగామి ఆర్టెమిస్‌ త్వరలో లాంచ్ కాబోతోంది. అయితే అంతరిక్ష ప్రయాణంలో మహిళల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు డ్రై ఇమ్మర్షన్ (Dry Immersion) అధ్యయనాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 21న ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని MEDES స్పేస్ క్లినిక్‌లో ఇద్దరు మహిళలతో ఈ అధ్యయనం ప్రారంభమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సైన్స్ డేటాలోని లింగ అంతరాన్ని పరిష్కరించేందుకు అధ్యయనాన్ని ప్రారంభించింది. మహిళలపై ఈ తరహా అధ్యయనం నిర్వహించడం ఇది రెండవసారి. అంతకముందు ఐరోపాకు మొదటిసారి ఇలాంటి అధ్యయనాన్ని జరిపింది.

డ్రై ఇమ్మర్షన్ స్టడీ అంటే :
డ్రై ఇమ్మర్షన్ స్టడీలో.. వాటర్‌ప్రూఫ్ ఫాబ్రిక్‌తో కప్పిన బాత్‌టబ్‌ల మాదిరిగానే కంటైనర్లను ఏర్పాటు చేస్తారు. ఆ వాటర్ బెడ్లపై వాలంటీర్లను పడుకునేందుకు వీలుగా నీటి ఉపరితలానికి సమానంగా ఉంచుతారు. ఫలితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల మాదిరిగా తేలుతున్న అనుభవం కలుగుతుంది. శరీరమంతా తేలిపోతున్నట్టుగా అనుభూతి కలుగుతుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పరిశోధనలో మహిళలపై శారీరక, మానసిక ప్రభావాలు ఎలా ఉంటాయనేది అవగాహన లేదని పేర్కొంది. డ్రై ఇమ్మర్షన్ టెక్నిక్ వ్యోమగాములు అంతరిక్షంలో అనుభవించే తేలికైన అనుభూతికి దగ్గరగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కండరాలు, ఎముకల సాంద్రతను కోల్పోతారు. దృష్టి కోల్పోయి కళ్లు మసగబారిన ఫీలింగ్ కలుగుతుంది. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల మెదడు వైపు చేరే ద్రవాలు మారినప్పుడు వినికిడి లోపాలు ఏర్పడవచ్చునని మునుపటి అధ్యయనాలు చెబుతున్నాయి.

కక్ష్యలో ఆరోగ్యంగా ఉండటానికి అంతరిక్ష వ్యోమగాములను ముందుగానే ఇలాంటి ప్రయోగాలతో సన్నద్ధం చేస్తారు. ఈ రకమైన పరిశోధనల ఫలితాలు వ్యోమగాములకు ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇన్స్టిట్యూట్ ప్రకారం.. నీటిపై థొరాక్స్‌తో కప్పినప్పుడు, కాళ్లు ట్రంక్‌ను కాటన్ షీట్‌తో కప్పినప్పుడు డ్రై ఇమ్మర్షన్ ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగంలో వెలుపల చేతులు, తల మాత్రమే తేలుతున్నట్టుగా కనిపిస్తాయి. అధ్యయనంలో పాల్గొన్నవారిని 24 గంటల పాటు ఇమ్మర్షన్ ట్యాంక్‌లో ఉంచుతారు. వీలైనంత వరకు వారిని కదలకుండా ఉండేలా చూస్తారు. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు మూత్రం, రక్త నమూనాలను సేకరిస్తుంటారు. ఈ రకమైన వాతావరణ పరిస్థితిని శరీరం ఎలా స్వీకరిస్తుందో అధ్యయనంలో విశ్లేషిస్తామని ఇనిస్టిట్యూట్ పేర్కొంది.
Allu Arjun : అల్లు అర్జున్ కి 160 ఏళ్ళ పురాతన గిఫ్ట్ ఇచ్చిన మలయాళ వీరాభిమాని

ట్రెండింగ్ వార్తలు