Hardik Pandya : ఆఖ‌రి స్థానంతో సీజ‌న్‌ను ముగించిన ముంబై.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాకిచ్చిన బీసీసీఐ

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ క‌థ ముగిసింది.

PIC Credit : MI

Hardik Pandya suspended for one match : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ క‌థ ముగిసింది. శుక్ర‌వారం వాంఖ‌డే వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ 18 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజ‌న్‌ను ఓట‌మితో ఆరంభించిన ముంబై ఓట‌మితోనే ముగించింది. మొత్తంగా ఈ సీజ‌న్‌లో 14 మ్యాచులు ఆడిన ముంబై 10 మ్యాచుల్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంతో టోర్నీని ముగించింది.

ఈ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. నికోల‌స్ పూర‌న్ (29 బంతుల్లో 75) దంచికొట్ట‌గా కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 55) స‌మ‌యోచిత హాఫ్ సెంచ‌రితో రాణించాడు. ముంబై బౌల‌ర్ల‌లో నువాన్ తుషారా, పీయూష్ చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. అనంత‌రం లక్ష్య ఛేద‌న‌లో ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 196 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. రోహిత్ శ‌ర్మ‌(38 బంతుల్లో 68), న‌మ‌న్ ధిర్ (28 బంతుల్లో 62 నాటౌట్‌) పోరాడిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది.

Team India Head Coach : ద్ర‌విడ్ త‌రువాత టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..?

హార్దిక్ కు షాక్‌..

అస‌లే టోర్నీని అట్ట‌డుగు స్థానంతో ముగించిన బాధ‌లో ఉన్నహార్దిక్ పాండ్యాకు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షాకిచ్చింది. హార్దిక్ పాండ్యా పై ఓ మ్యాచ్ నిషేదం విధించింది. ల‌క్నోతో మ్యాచ్‌లో ముంబై నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌డంలో విఫ‌లం కావ‌డమే ఇందుకు కార‌ణం.

ఈ సీజ‌న్‌లో స్లో ఓవ‌ర్ రేటును ముంబై మూడో సారి న‌మోదు చేసింది. దీంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై ఓ మ్యాచ్ నిషేదంతో పాటు అత‌డి మ్యాచ్ ఫీజులో రూ.30ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా జ‌ట్టులోని మిగిలిన ఆట‌గాళ్లకు రూ.12ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం రెండింటిలో ఏదీ త‌క్కువ అయితే దాన్నిఫైన్‌గా విధించారు. స‌స్పెష‌న్ కార‌ణంగా వ‌చ్చే ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో తొలి మ్యాచ్‌లో హార్దిక్ ఆడ‌కూడ‌దు.

Rishabh Pant : ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ ఔట్‌.. రిష‌బ్ పంత్ భావోద్వేగ పోస్ట్‌..