Tamil Nadu Rains : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిండు వేసవిలో వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. కన్యాకుమారి, తేని, టెన్ కాశి, కోయంబత్తూరు, పుడుకొట్టై, తంజావూర్, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, క్రిష్ణగిరి, తిరుపూర్, విరుదు నగర్, నీలగిరి జిల్లాలకు వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన వాతావరణ శాఖ.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read : Ap Rains : ఏపీకి చల్లని కబురు.. మూడు రోజులు వర్షాలు..!
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో 0-3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం కుర్తాళం జలపాతాన్ని వరద నీరు ముంచెత్తింది. నీలగిరి పర్వత శ్రేణులలో ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీలోనూ కుండపోత వర్షం కురిసింది. ఊటీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పర్యాటకులకు వాతావరణ శాఖ సూచించింది. ఈ నెల 22వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Also Read : డేంజర్ బెల్స్ మోగిస్తున్న హోర్డింగ్స్..! ముంబై ఘటనతో హడలిపోతున్న హైదరాబాద్ సిటీ జనం
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. భారీ వర్ష ప్రభావం ఉన్న జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి రబ్బరు పడవలు, మోటార్లు, లైఫ్ జాకెట్లు, జనరేటర్లు, ప్రథమ చికిత్స సామాగ్రి తదితరాలను అందించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునెల్వేలి జిల్లా యంత్రాంగం భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
తిరునెల్వేలి సహా దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. ఒక్కో బృందానికి 30 మంది సిబ్బంది చొప్పున 300 మంది సిబ్బంది కూడిన 10 బృందాలను తిరునల్వేలి, కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు మూడు బృందాల చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. వారు వర్షాల కారణంగా ఇబ్బంది ఎదుర్కొటున్న ప్రాంతాల్లో ప్రజలకు సహాయసహకారాలు అందించనున్నారు.