UK
UK – Airspace: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కి వచ్చే విమానాలతో పాటు ఆ దేశం నుంచి వెళ్లే విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. గగనతల ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో యూకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ పనిచేయడం లేదని అన్నారు. యూకేకు రావడానికి టికెట్లు బుక్ చేసుకుని ఇతర దేశాల్లో సిద్ధంగా ఉన్న వారికి విమాన సేవలు ఆలస్యంగా అందుతాయని చెప్పారు. ప్రయాణికుల రక్షణ కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. సాంకేతిక లోపాన్ని పరిష్కరించి, విమానాల రాకపోకలను పునరుద్ధరించడానికి ఇంజనీర్లు పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. తమ సేవల తాజా సమాచారం కోసం తమ వెబ్ సైట్ చూడాలని ప్రయాణికులకు విమానయాన సంస్థ లోగానయిర్ సూచించింది. అధికారులతో తాము చర్చిస్తున్నామని ఈజీజెట్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
UK Air Traffic Control Disruption – Monday 28 August 2023
Due to a network-wide outage of Air Traffic Control systems, delays and disruption are expected throughout the day for all airlines. Under these circumstances, Loganair is offering passengers travelling today
— Loganair (@FlyLoganair) August 28, 2023