US Presidential Elections 2024: ట్రంప్‌ అధ్యక్షుడైతేనే చైనాను కట్టడి చేయడం ఈజీనా?

చైనాతో మనకు ఘర్షణ వాతావరణ ఉంది. పాక్‌తో భారత్‌కు అస్సలే పడదు. ఈ రెండు దేశాల పట్ల..

అసలే అగ్రరాజ్యం. ఆ దేశంలో ఎన్నికలు అంటే అందరి చూపు అటువైపే. నాలుగు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. జనవరిలో కొత్త అధ్యక్షుడు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు అగ్రరాజ్యంలోనే కాదు.. ప్రపంచదేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీ గెలిస్తుంది..ఎవరు వైట్‌ హౌస్‌లో కాలుమోపబోతున్నారన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఈ మధ్య జరిగిన లేటెస్ట్‌ పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ యూఎస్ ప్రెసిడెంట్‌ పోల్స్‌పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

మొన్నటి వరకు అంతా అయిపోయింది ట్రంపే ప్రెసిడెంట్ అవుతారన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. జోబైడెన్ తప్పుకోవడంతో రేసులోకి కమలా హారిస్‌ వచ్చేసింది. దీంతో గెలుపోటముల అంచనాలు తారుమారు అవుతున్నాయి. ప్రజల మద్దతు ఎవరికి ఉంది.? గెలిచేదెవరు.? అధ్యక్షుడిగా వైట్‌ హౌస్‌లో అడుగుపెట్టేదెవరన్నది ఆసక్తిరేపుతోంది.

బైడెన్ తప్పుకోవడంతో యూఎస్ పాలిటిక్స్‌లో కొత్త టర్న్‌ తీసుకుంటున్నాయి. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్ నడుస్తోంది. వరుసగా రెండోసారి గెలిచి తీరాలని డెమొక్రాట్లు, ఈసారి విజయం సాధించి పట్టునిలుపుకోవాలని ట్రంప్‌.. పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రిపబ్లికన్ల తరఫున ట్రంప్ అధ్యక్ష రేసులో ఉంటారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఇండియాకు చెందిన ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్‌ పేరు ఖరారు అయింది. ఇది భారత్‌కు అనుకూల అంశంగా చెప్పుకోవచ్చు. ట్రంప్‌ భారత్‌తో పాటు ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

రిపబ్లికన్లు గెలిస్తేనే భారత్‌కు మేలు?
డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలను పోల్చుకుంటే.. రిపబ్లికన్లు గెలిస్తేనే కొన్నిఅంశాల్లో భారత్‌కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. చైనాతో మనకు ఘర్షణ వాతావరణ ఉంది. పాక్‌తో భారత్‌కు అస్సలే పడదు. ఈ రెండు దేశాల పట్ల డెమొక్రాట్లు పెద్దగా వ్యతిరేకతతో లేరు. ట్రంప్ మాత్రం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న ఆలోచనతో ఉన్నారు.

ట్రంప్‌ చైనాకు బద్ధ వ్యతిరేకి. ఒకవేళ భారత మూలాలున్న కమలా హారిస్‌ ప్రెసిడెంట్ అయినా..చైనా, పాక్ విషయంలో బైడెన్ చెప్పినట్లుగానే నడుచుకుంటారన్న చర్చ ఉంది. అయితే భారతదేశ వ్యూహాత్మక అవసరాలు తీరేందుకు డెమొక్రాట్లు అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండటం అవసరం. డెమొక్రాట్లకు బీజేపీ అంటే అసలు పడటం లేదు. ట్రంప్‌నకు బీజేపీ రాజకీయాలంటే పట్టింపేమీ లేదు కానీ.. ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు. ముస్లిం, మైనార్టీ ఈక్వేషన్ కారణంగా డెమొక్రాట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీతో అంత సఖ్యతతో లేరు.

ట్రంప్‌ అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కే జరిగింది. చైనాతో ట్రంప్‌ తెగదెంపులు చేసుకోవడం వల్లే అప్పుడు యూఎస్ పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్‌ తీరు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేం. వ్యక్తుల కంటే భారత్‌, అమెరికా దేశాల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్‌ సామర్థ్యం పెరిగితేనే చైనాను కంట్రోల్ చేయొచ్చన్నది అగ్రరాజ్యం అంచనా. ఇప్పటికే రక్షణ రంగంలో సహకారంతో పాటు, అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెడుతుండటం.. భారత్‌పై అమెరికా విశ్వాసానికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు.

ట్రంప్‌ ఓడిపోతే?
ట్రంప్‌ ఓడిపోతే చైనా ఆధిపత్య వైఖరికి వ్యతిరేకంగా భారత్‌ పోరాటానికి అగ్రరాజ్యం మద్దతు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. అలాగే పాకిస్థాన్‌ పట్ల ట్రంప్‌ కఠినంగా ఉంటారు. డెమొక్రాట్లు మాత్రం పాక్‌ పట్ల ఉదారంగా ఉంటారు. అందుకే పాక్‌.. డెమొక్రాట్ల గెలుపును కోరుకుంటోంది. ట్రంప్‌ మళ్లీ గెలిస్తే పాక్‌ పట్ల మరింత వ్యతిరేకతతో ప్రవర్తించవచ్చని, డెమొక్రాట్లు గెలిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వారు కోరుకుంటున్నారు.

అయితే డెమొక్రాట్లు గెలిస్తే అమెరికాలో మనవాళ్ల ఉద్యోగాలకు ఢోకా ఉండదు. జాతీయవాద రాజకీయాలు చేస్తున్న రిపబ్లికన్‌ పార్టీ అమెరికన్లకే ప్రాధాన్యం ఇస్తుంది. H1B వీసాలపై ట్రంప్‌ వ్యవహారశైలి ఇందుకు నిదర్శనం. ట్రంప్ అధికారంలోకి వస్తే విదేశీ వలసదారులపై ఎప్పుడెలా రెస్పాండ్ అవుతారో తెలియదు. ఒకవేళ H1B వీసాలపై ట్రంప్ వైఖరి మరోలా ఉంటే మాత్రం ఇండియన్స్‌కు ఇబ్బంది తప్పదు. డెమొక్రాటిక్‌ పార్టీ గెలిస్తే మనవాళ్ల ఉద్యోగాలు సేఫ్‌ అనే వాదన వినిపిస్తోంది.

Also Read: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

ట్రెండింగ్ వార్తలు