Kamala Harris : జూమ్‌లో కమలా హారిస్ రికార్డుల మోత.. ‘ఫండ్‌ రైజింగ్‌’లో భారీగా నిధుల వెల్లువ..!

Kamala Harris : భారత సంతతి అమెరికన్‌ కమలా హారిస్‌‌కు భారీగా మద్దుతు లభిస్తోంది. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మద్దతుదారులు గురువారం రాత్రి జూమ్ వేదికగా హాజరై రికార్డులు బద్దలు కొట్టారు. 

Kamala Harris breaks Zoom

Kamala Harris : భారత సంతతి అమెరికన్‌ కమలా హారిస్‌‌కు భారీగా మద్దుతు లభిస్తోంది. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మద్దతుదారులు గురువారం రాత్రి జూమ్ వేదికగా హాజరై రికార్డులు బద్దలు కొట్టారు.

Read Also : Trump FBI Director : మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు నిజంగానే బుల్లెట్ తగిలిందా? ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ లేవనెత్తిన అనుమానాలు..!

డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా మద్దతు కోసం 90 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 16.48 కోట్లను)కు పైగా నిధులను సేకరించారు. అయితే, జూమ్ కాల్ సమయంలో అవాంతరాలు ఉన్నప్పటికీ.. అతిపెద్ద జూమ్ మీటింగ్‌లో లక్షా 64వేల మంది మద్దతుదారులు పాల్గొన్నారు. “వైట్ ఉమెన్.. ఆన్సర్ ది కాల్” అనే పేరుతో ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ నిర్వహించారు.

కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద జూమ్ కాల్ :
ఈ కార్యక్రమంలో బ్రిటన్ వంటి ప్రముఖ అమెరికన్ సెలబ్రిటీలు భారీ ఎత్తునా హాజరయ్యారు. జూమ్ రికార్డ్-బ్రేకింగ్ కాల్ రికార్డును బద్దలు కొట్టింది. కంపెనీ చరిత్రలో ఇది అతిపెద్ద జూమ్ కాల్ అని చెప్పవచ్చు. జూమ్ కాల్ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది మద్దతుదారులు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌కు మారారు.

దేశవ్యాప్తంగా మహిళల్లో చాలామంది లైవ్ స్ట్రీమ్ చాట్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌పై అధ్యక్ష రేసు నుంచి ఇటీవల అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగినందున వైఎస్ ప్రెసిడెంట్ హారిస్‌కు మద్దతు కోరుతూ జూమ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన మద్దతుదారుల నుంచి నిమిషానికి 20వేల డాలర్లను సేకరించారు.

‘ఫ్రైడే నైట్ లైట్స్’తో పాపులారిటీ సంపాదించిన కొన్నీ బ్రిటన్, హారిస్‌కు భారీ ఆమోదం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. హాస్యనటుడు కరోల్ లీఫ్ 5లక్షల డాలర్ల నిధులను సేకరిస్తానని హామీ ఇచ్చారు. హారిస్‌కు ఇదో మూడో భారీ జూమ్ కాల్. డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఆమె మద్దతును భారీగా కూడగట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత జూమ్ కాల్‌లలో 44వేల మంది నల్లజాతి మహిళలు, 50వేల మంది నల్లజాతీయులు ఉన్నారు. ఈ ఈవెంట్‌ల ద్వారా వరుసగా 1.5 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ డాలర్లను కమలా హారిస్ మద్దతుదారులు సేకరించారు.

Read Also : JioAirFiber Plans : జియో యూజర్లకు అదిరే ఆఫర్.. ఎయిర్‌ఫైబర్ ప్లాన్లపై 30శాతం డిస్కౌంట్.. ఎప్పటివరకంటే?

ట్రెండింగ్ వార్తలు