Speech Therapist : పంటినొప్పి సర్జరీలో నాలుకకు తీవ్రగాయం.. డెంటిస్ట్‌పై రూ. 11 కోట్లు దావా వేసిన స్పీచ్ థెరపిస్ట్..!

Speech Therapist : ది మెట్రో ప్రకారం.. 55 ఏళ్ల అలిసన్ వింటర్‌బోథమ్ అనే స్పీచ్ థెరపిస్ట్.. 2020లో దంత వైద్యుడి దగ్గర పంటి సర్జరీ చేయించుకుంది. ఆ చికిత్స సమయంలో వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఆమె నాలుకకు తీవ్రగాయమైంది.

Speech Therapist Sues Dentist For Rs 11 Crore ( Image Source : Google )

Speech Therapist : కనిపించని దేవుని కన్నా ప్రత్యక్ష దైవం వైద్యుడేనని భావిస్తారు. వ్యైద్యో నారాయణ హరిః అనే మాటకు అంత విలువ ఇస్తారు. కానీ, కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి సంభవిస్తుంటుంది. వైద్యులు ఏదైనా చికిత్స చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి బాధితుడికి సమస్యను మరింత పెద్దదిగా చేయకూడదు. కొన్నిసార్లు ప్రాణాలే కాదు.. కెరీర్ కూడా నాశనమయ్యే పరిస్థితికి దారితీస్తుంది. అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Read Also : Billionaire Yusuff Ali : అభిమానం అంటే ఇదే భయ్యా.. బిలియనీర్‌కు భలే గిఫ్ట్ ఇచ్చాడుగా..!

ది మెట్రో ప్రకారం.. 55 ఏళ్ల అలిసన్ వింటర్‌బోథమ్ అనే స్పీచ్ థెరపిస్ట్.. 2020లో దంత వైద్యుడి దగ్గర పంటి సర్జరీ చేయించుకుంది. ఆ చికిత్స సమయంలో వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఆమె నాలుకకు తీవ్రగాయమైంది. దాంతో ఆమె మాట్లాడటమే కష్టంగా మారింది. ఫలితంగా ఆ స్పీచ్ థెరపిస్ట్ కెరీర్ నాశనమైంది.

దంత వైద్యుడు చేసిన పనికి తన జీవితమే కోల్పోయానని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో డెంటిస్ట్‌పై ఒక మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 10,78,77900) నష్టపరిహారం కోరుతూ దావా వేసింది. 2020 నవంబర్‌లో వింటర్‌బోథమ్ పంటి చికిత్స తర్వాత తన జిహ్వ నాడి దెబ్బతిందని, తన నాలుకకు అన్ని వేళలా భయంకరమైన నొప్పిని కలిగించిందని పేర్కొంది.

అలిసన్ ఆరోపణలను ఖండించిన డాక్టర్ షహరక్ :
స్పీచ్ థెరపిస్ట్‌గా ఆమె కొనసాగలేని పరిస్థితి ఎదురైంది. ఈ నొప్పి వల్ల పనిచేసుకోలేకపోతున్నానని వాపోయింది. హాయిగా మాట్లాడలేని స్థితికి చేరుకుంది. సర్జరీ సమయంలో దంతవైద్యుడు డాక్టర్ అరాష్ షహ్రక్.. ఇలాంటి ప్రమాదాల గురించి పూర్తిగా హెచ్చరించలేదని ఆమె ఆరోపించింది. అయితే, ఆమె ఆరోపణలను డాక్టర్ షహరక్ ఖండించారు.

పంటి సర్జరీ చేసే ముందు వింటర్‌బోథమ్‌ను సూచనలు చేశానని చెప్పారు. కానీ, ఆమెకు ఇంత ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందని ఊహించలేదన్నారు. ప్రస్తుతం స్పీచ్‌ థెరపిస్ట్‌గా కెరీర్ నాశనం అయిందని, ఈ పరిస్థితికి దంత వైద్యుడే కారణమంటూ అలిసన్ హైకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.

తన నాలుక నొప్పిని వింటర్‌బోథమ్ మంటతో పోల్చింది. “నా నాలుక అన్ని వేళలా కాలిపోతున్నట్టుగా జలదరిస్తుంది. నేను తీవ్రనొప్పితో బాధపడుతున్నాను. నేను కొంచెం మాట్లాడటానికి నా నాలుకను కదిలించిన ప్రతిసారీ నాడి అధిక-ప్రేరేపితమవుతుంది. తద్వారా అది మంట, జలదరింపుతో పాటు మరింత అధ్వాన్నంగా మారుతుంది. నేను మాట్లాడేటప్పుడు ఇది చాలా దారుణంగా ఉంటుంది.

స్పీచ్ థెరపీకి తిరిగి రాలేకపోయానని, మాట్లాడకుండా విరామం తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు కౌన్సెలింగ్ క్లయింట్‌లను మాత్రమే చూడగలను. ఇది చాలా మంది రోగులను చూడటం కూడా ఒక పోరాటంలా అనిపిస్తుంది. నేను రోజుకు నలుగురు క్లయింట్‌లను చూడటానికి ప్రయత్నిస్తే.. అది చేయలేని పరిస్థితిగా అనిపిస్తుంది” అని తీవ్ర మనోవేధనకు గురైంది.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

ట్రెండింగ్ వార్తలు