Billionaire Yusuff Ali : అభిమానం అంటే ఇదే భయ్యా.. బిలియనీర్‌కు భలే గిఫ్ట్ ఇచ్చాడుగా..!
Billionaire Yusuff Ali : అబుదాబికి చెందిన వ్యాపారవేత్త అలీ తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవల కేరళకు వచ్చారు. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆయన తన తల్లి ఫొటో ఉన్న గడియారాన్ని బహుకరించాడు.
- Sreehari A
- Published On : July 24, 2024 / 07:05 PM IST
This fan gave Yusuff Ali a watch with his mother’s photo ( Image Souce : Google )
Lulu Mall Yusuff Ali : ఆయనో బిలియనీర్.. ఆయన కొనలేని వస్తువంటూ ఏది ఉండదు. వసతి, సదుపాయాలు ఇలా కావాల్సినవన్నీ ఉంటాయి. అలాంటి అపర కుబేరుడికి మనం ఏం ఇవ్వగలం.. ఒకవేళ ఇచ్చినా ఆయనేం తీసుకుంటారులే అనుకుంటాం. అదే మీరు ఒక బిలియనీర్‌కు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు.. కానీ, ఒక అభిమాని మాత్రం వెలకట్టలేని వస్తువును బిలియనీర్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఆ ప్రత్యేక బహుమతిని అందుకున్న ఆ బిలియనీర్ ఎవరో కాదు.. లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ..
Read Also : WhatsApp Meta AI : వాట్సాప్ మెటా ఏఐ మరో 6 కొత్త భాషల్లోకి.. ఇకపై హిందీలోనూ రిప్లయ్ ఇస్తుంది..!
ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే.. బిలియనీర్ అలీ తల్లి ఫొటో కలిగిన వాచ్. అభిమాని బహుమతిని చూడగానే బడా వ్యాపారవేత్త అలీ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కేరళలో జన్మించిన యూసఫ్ అలీకి గల్ఫ్, భారత్‌లో 256 హైపర్ మార్కెట్‌లు, మాల్స్ ఉన్నాయి. అంతేకాదు.. లులు గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అలీ వ్యక్తిగత నికర విలువ 8.9 బిలియన్ డాలర్లను మించిపోయింది.
అబుదాబికి చెందిన వ్యాపారవేత్త అలీ తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవల కేరళకు వచ్చారు. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆయన తన తల్లి ఫొటో ఉన్న గడియారాన్ని బహుకరించాడు. “మీ అమ్మ గురించి మీరు మాట్లాడుతున్న వీడియో నేను చూశాను. మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో..” అని వాచ్ ఇచ్చిన అభిమాని వీడియోలో తెలిపాడు.
బిలియనీర్ అలీ ఏమన్నారంటే? :
దానిపై స్పందించిన బిలియనీర్ అలీ.. “ప్రతి ఒక్కరూ తమ తల్లులను ప్రేమిస్తారు.. ఇది నాకే కాదు. ప్రపంచంలో తల్లిని ప్రేమించని వారెవరు?” అంటూ బదులిచ్చారు. “ఇది తల్లిని అమితంగా ప్రేమించే వ్యక్తి కోసం.. అందులో మీ అమ్మ ఫొటో చెక్కి ఉంది.. అది వాటర్ ప్రూఫ్ వాచ్,” అని అభిమాని చెప్పాడు. అలీకి వాచ్‌ని అందజేసిన అభిమాని తనతో ఫొటో దిగాలని కోరాడు.
గల్ఫ్ న్యూస్ ప్రకారం.. 2001లో అలీ తన తల్లిదండ్రులిద్దరినీ కారు ప్రమాదంలో కోల్పోయారు. దుబాయ్ నుంచి అబుదాబికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. యూసఫ్ అలీ ఇటీవల తన బంధువు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు కేరళకు వచ్చారు. లులు గ్రూప్ డైరెక్టర్ ఎంఏ సలీం కుమార్తె నౌరిన్ వివాహం త్రిసూర్‌లో జరిగిన హైప్రొఫైల్ వెడ్డింగ్‌లో ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర వీఐపీలు పాల్గొన్నారు.
త్రిసూర్‌లోని హయత్ రీజెన్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహ వేడుకలో అలీ అతిథులను పలకరిస్తున్నట్లు చూడవచ్చు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, యుఎఇ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రి, మరికొందరు అతిథులుగా ఉన్న ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరయ్యారు.
