No Insurance No Fuel: ఇక ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్.. కేంద్రానికి సంచలన ఆదేశాలు.. వాహనదారులకు సుప్రీం కోర్టు షాక్
దేశంలో థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్(No Insurance No Fuel) లేని వాహనాల రాకపోకలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
Supreme court mandates no fuel without valid third party vehicle insurance in india
- ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్
- కొత్త రూల్స్‌పై సుప్రీం ఆదేశాలు
- వాహన ఇన్సూరెన్స్ కాలపరిమితి పెంపు
No Insurance No Fuel: దేశంలో థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ లేని వాహనాల రాకపోకలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ సంజయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఈ నిబంధనను పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా ముందుగా ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్‌ను రూపొందించి పరిశీలించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
Sadarem Pension: ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇన్సూరెన్స్ కాలపరిమితి పెంపుపై కీలక సూచన:
కేవలం ఇంధన విక్రయాలపై ఆంక్షలే కాకుండా, కొత్త వాహనాల ఇన్సూరెన్స్ (No Insurance No Fuel)వ్యవధి పెంపుదలపై కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కొత్తగా కొనుగోలు చేసే కార్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వ్యవధిని 4 ఏళ్లకు, అలాగే ద్విచక్ర వాహనాలకు (టూ వీలర్స్) 6 ఏళ్లకు పెంచాలని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల వాహనదారులు ప్రతి ఏడాదీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోలేక నిర్లక్ష్యం చేసే ధోరణికి చెక్ పడుతుందని కోర్టు అభిప్రాయపడింది.
రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యం:
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సరైన పరిహారం అందకపోవడానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడమే ప్రధాన కారణమని కోర్టు గుర్తుచేసింది. పెట్రోల్ బంకుల్లో సాంకేతికత ఆధారంగా ఇన్సూరెన్స్ స్టేటస్ తనిఖీ చేసి, క్లియరెన్స్ ఉన్న వాహనాలకే పెట్రోల్ లేదా డీజిల్ పోసే విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడం, బాధితులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త ఆదేశాలు తోడ్పడనున్నాయి.
