Nagarjuna : కొత్త గెటప్‌లో కింగ్ నాగార్జున..! కెరీర్‌లో ఎప్పుడూ చేయని పాత్రలో..!
కింగ్ నాగార్జున త్వరలో ఓ కొత్త పాత్రలో మెరవనున్నారని టాలీవుడ్ సమాచారం.
- Thota Vamshi Kumar
- Published On : July 24, 2024 / 09:26 PM IST
Is Nagarjuna playing Villain Role in super star movie
Nagarjuna Akkineni : కింగ్ నాగార్జున త్వరలో ఓ కొత్త పాత్రలో మెరవనున్నారని టాలీవుడ్ సమాచారం..హీరోగా, నిర్మాతగా నాగార్జున ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇక రియాల్టీ షోల హోస్ట్‌గానూ మెరిసారు. తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కుబేరా సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో నాగార్జునతో పాటు ధనుష్ కూడా ఉన్నాడు. ఇక నాగార్జున ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
తమళ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ‘కూలీ’ అనే సినిమాలో నాగార్జున నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా, నాగార్జున కూడా ఉంటారనేది తాజా అప్డేట్.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని విలన్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. విలన్ క్యారక్టర్ అయినా రజనీకి దీటుగా ఉండే పాత్ర కావడంతో నాగార్జున కూడా ఓకే చెప్పారంటున్నారు.
Chiranjeevi : లండన్‌లోని హైడ్ పార్కులో మనవరాలు క్లీంకారతో చిరంజీవి.. ఫోటో వైరల్
ఈ చిత్రంలో నాగార్జునను చాలా కొత్తగా ప్రెజంట్ చేయడానికి దర్శకుడు లోకేశ్ చూస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ‘అంతం’ మూవీలో నాగార్జున తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు విలన్‌గా మరో సారి కనిపించబోతున్నడనే సమాచారం టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా మారింది. ఈ సినిమా తర్వాత ఇలాంటి పాత్రలకు నాగార్జున గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
