Nita Ambani IOC Member : ఒలింపిక్ గేమ్స్ 2024.. ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ మళ్లీ ఏకగ్రీవం.. వంద శాతం ఓటింగ్..!

Nita Ambani IOC Member : 2016లో రియో ​​డి జనీరో ఒలింపిక్స్‌లో ప్రతిష్టాత్మక సంస్థలో చేరేందుకు నీతా అంబానీ తొలిసారిగా నియమితులయ్యారు. ఐఓసీలో చేరిన భారత మొదటి మహిళగా నీతా అంబానీ ఇప్పటికే అసోసియేషన్ కోసం ఎంతో కృషిచేశారు.

Nita Ambani re-elected unanimously as IOC Member ( Image Source : Google )

Nita Ambani IOC Member : పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలకు ముందు.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC).. ప్రముఖ దాతృత్వవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీని భారత్ నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా (IOC)గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించింది. పారిస్‌లో ప్రస్తుతం జరుగుతున్న 142వ ఐఓసీ సెషన్‌లో వంద శాతం ఓట్లతో అంబానీ మరోసారి ఏకగ్రీవంగా గెలుపొందారు. ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నీతా అంబానీ పర్యటిస్తున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు ఆవహ పారిస్‌కు చేరుకున్నారు.

Read Also : Billionaire Yusuff Ali : అభిమానం అంటే ఇదే భయ్యా.. బిలియనీర్‌కు భలే గిఫ్ట్ ఇచ్చాడుగా..!

ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. “అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యునిగా తిరిగి ఎన్నికైనందుకు నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ప్రెసిడెంట్ బాచ్, ఐఓసీలోని నా సహోద్యోగులందరికీ నాపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఈ రీ-ఎలక్షన్ కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. ప్రపంచ క్రీడా రంగంలో భారత్‌పై ప్రభావాన్ని గుర్తించడం కూడా. నేను ప్రతి భారతీయుడితో ఈ ఆనందాన్ని గర్వంగా షేర్ చేసుకుంటున్నాను. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో నా వంతు సాకారం అందిస్తాను ” అని పేర్కొన్నారు.

2016లో రియో ​​డి జనీరో ఒలింపిక్స్‌లో ప్రతిష్టాత్మక సంస్థలో చేరేందుకు నీతా అంబానీ తొలిసారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఐఓసీలో చేరిన భారత మొదటి మహిళగా నీతా అంబానీ ఇప్పటికే అసోసియేషన్ కోసం ఎంతో కృషిచేశారు. అదే సమయంలో భారత క్రీడా ఆశయాలు, ఒలింపిక్ దృష్టిని మరల్చారు. 2023 అక్టోబర్‌లో 40 ఏళ్లకు పైగా ముంబైలో మొదటి ఐఓసీ సెషన్‌ను ఇటీవలే నిర్వహించారు.

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ మిలియన్ల కొద్దీ భారతీయులకు వనరులు, అవకాశాలతో సాధికారత కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె క్రీడలు, విద్య, ఆరోగ్యం, కళ, సంస్కృతి అంతటా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ దేశంలోని 22.9 మిలియన్ల కన్నా ఎక్కువ మంది పిల్లలు, యువతకు అనేక కార్యక్రమాలతో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత వర్గాల వరకు భారత క్రీడా వృద్ధిని నడిపించడంలో ముందంజలో ఉంది. దేశమంతటా వివిధ రకాల క్రీడలను ప్రోత్సహించడంపైనే సంస్థ దృష్టి సారించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)తో దీర్ఘకాలిక భాగస్వామ్యంలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్.. పారిస్ ఒలింపిక్స్ 2024లో మొట్టమొదటి ఇండియా హౌస్‌ను ప్రారంభిస్తోంది.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

ట్రెండింగ్ వార్తలు