Suryakumar Yadav : శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు సూర్యకు రింకూ సింగ్ స్పెషల్ రిక్వెస్ట్..
కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నయా ఫినిషర్ రింకూ సింగ్‌ల మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది.
- Thota Vamshi Kumar
- Published On : July 24, 2024 / 08:26 PM IST
Suryakumar Yadav and Rinku Singh engage in hilarious banter
Suryakumar Yadav – Rinku Singh : కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశంలో టీమ్ఇండియా తొలి సిరీస్ సమరానికి సిద్ధం అవుతోంది. జూలై 27 నుంచి శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే శ్రీలంకకు చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది. కాగా.. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నయా ఫినిషర్ రింకూ సింగ్‌ల మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది.
సోషల్ మీడియా ద్వారా సూర్యకుమార్ యాదవ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. రింకూ సింగ్ తనను బ్యాట్ అడిగినట్లుగా పోస్ట్ పెట్టాడు. దీనికి రింకూ కూడా స్పందించాడు. సూర్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రింకూ ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. దేవుడి ప్లాన్.. సరే లే బ్యాట్ తీస్తో అని పేర్కొన్నాడు.
సూర్య ఇన్‌స్టా స్టోరీని రింకూ సింగ్ రీ పోస్ట్ చేస్తూ ఇచ్చేయ్ అన్న బ్యాట్‌ను అని అన్నాడు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా.. ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ నుంచి రింకూ సింగ్ బ్యాట్‌ను తీసుకున్నాడు. దాన్ని విరగొట్టాడు. మరో బ్యాట్ ఇవ్వాలంటూ కోహ్లీ వెంటపడిన సంగతి తెలిసిందే.
లంకతో టీ20 సిరీస్ విషయానికి వస్తే.. జూలై 27, 28, 30 తేదీల్లో మ్యాచులు ఆడనుంది. ఈ మూడు మ్యాచులు కూడా పల్లెకలె వేదికగానే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచులు ఆరంభం కానున్నాయి.
భారత టీ20 జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
